Site icon OkTelugu

Wedding Dates: మంచి ముహూర్తాలొచ్చాయి.. ఇప్పుడు మిస్ కాకండి

Wedding Dates

Wedding Dates

Wedding Dates: తెలుగు రాష్ట్రాల్లో హిందూ వివాహాలు మూడు నెలలుగా నిలిచిపోయాయి. మూఢం కారణంగా నవంబర్‌ 26 తర్వాత పెళ్లిళ్లు జరగడం లేదు. దీంతో ఫంక్షన్‌ హాళ్లు, పెళ్లి వ్యాపారాలు ఆగిపోయాయి. ఎక్కడా పెళ్లి సందడి కనిపించడం లేదు. అయితే మూడు నెలల విరామానికి ఇక బ్రేక్‌ పడనుంది. ఫిబ్రవరి 13 తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి. దీంతో పెళ్లి సందడి మొదలు కానుంది.

అనుకూలమైనా ముహూర్తాలు లేక…
మాఘ మాసం పెళ్లిళ్లకు అనుకూలం. కానీ ఈసారి పెద్దగా ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 18 వరకు ముహూర్తాలు లేవని పండితులు తెలిపారు. దీంతో ఈసారి పెళ్లిళ్లు లేకుండానే మాఘమాసం ముగియనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. దీంతో మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి.

వ్యాపారాల్లో ఉత్సాహం..
మూడు నెలలుగా పెళ్లిళ్లు లేకపోవడంతో అనేక వ్యాపారాలు స్తంభించాయి. బ్యాండు మేళాల, బట్టల దుకాణాలు, బంగారం దుకాణాలు, టెంట్‌హౌస్‌లు ఇలా అన్నీ వెలవెలబోయాయి. అయితే ఫిబ్రవరి 19 నుంచి మంచి రోజులు వస్తుండడంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి నుంచే ఆర్డర్లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఫంక్షన్‌హాళ్ల బుకింగ్‌కు పోటీ పడుతున్నారు. జ్యోతిషుల వద్ద జాతకాల హడావుడి పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల్లో సుమారు లక్ష పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.

పెరిగిన కేటరింగ్‌ ధరలు..
మూడు నెలల క్రితం ఉన్న ధరలను కేటరింగ్‌ సంస్థలు పెంచేశాయి. గ్యాప్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ధరలు పెంచాయి. కనిష్ట ధర రూ.150 నుంచి గరిష్ట ధర రూ.1000 కి పెరిగింది. వండించే వంటకాల ఆధారంగా రేట్లు మారనున్నాయి. ధరలు పెరిగినా ఆర్డర్లు తగ్గడం లేదు. ముందస్తుగా ఆర్డర్లు బుక్‌ చేస్తున్నారు.

వివాహ సీజన్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలకు ఊరట ఇస్తోంది. కుటుంబాలు మధుర స్మృతుల కోసం సిద్ధాలవుతున్నాయి. ఈ సమయంలో డిమాండ్‌ పెరగడంతో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి.

Exit mobile version