Zodiac signs : శని పేరు చెప్పగానే కొందరు భయపడిపోతుంటారు. కానీ శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. కాలగమనంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. అలాగే శని గ్రహం కూడా రాశులు మారుతూ ఉంటుంది. కుంభ రాశికి అధిపతి అయిన శని ప్రస్తుతం తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి తరువాత తన స్థానాన్ని మార్చుకుంటాడు. దీంతో కొన్ని రాశులపై ఈ ప్రభావం పడనుంది. 12 గ్రహాల్లో శని రెండు, నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది, 11వ గ్రహాల్లో ఉంటే శుభప్రదంగా భాిస్తారు. నవంబర్ లో శని తన స్థానాన్ని మార్చుకొని కుంభరాశిలో ప్రత్యక్షంగా కనిపిస్తాడు. దీంతో మూడు రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఆ రాశులు కలిగిన జీవితాల్లో అదృష్టం వరిస్తుంది. వారు ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఇంతకీ శని స్థానం మార్పు వల్ల ఏ రాశులపై ప్రభావం చూపుతుందో చూద్దాం..
మేష రాశిపై శని గ్రహం స్థానం మార్పు ప్రభావం పడనుంది. ఈ రాశి వారు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అన్ని విషయాల్లో ముందు ఉంటారు. సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాపారులకు అధికంగా లాభాలు ఉంటాయి. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెండింగ్ సమస్యలు పరిస్కారం అవుతాయి. బంధువుల నుంచి రుణం అందుతుంది.
శని కుంభ రాశి లో సంచరించడం వల్ల మిథున రాశిపై ప్రభావం పడుతుంది. దీంతో ఈ రాశి గల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. వీరికి అధికంగా ధన లాభం ఉంటుంది. ఇన్ని రోజులు వీరు పడిన కష్టం మాయం అవుతుంది.వద్దన్నా అదృష్టం వెంటపడి మరీ వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. ప్రతీ అంశంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. కెరీర్ పై దృష్టి పెట్టిన వారికిఅనుకూల ఫలితాలు ఉంటాయి.
శని కుంభ రాశిలో సంచారం వల్ల మకర రాశిపై ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో అనూహ్య మార్పుల రానున్నాయి. ఉద్యోగులు కొత్తగా ప్రమోషన్లు పొందుతారు. అధిక ఆదాయం కోసం మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబుడు పెడుతారు. వీరికి భాగస్వాముల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఇవి వ్యాపారానికి సంబంధించినవే కావడంతో వీటితో లాభాలు ఉంటాయి. కొందరు వడ్డీ లేని రుణం ఇవ్వడానికి ముందుకు వస్తారు. బంధువుల మద్దతు అధికంగా ఉంటుంది.
ఈ మూడు రాశుల కాకుండా మరికొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. అయితే కొన్ని రాశుల వారి జీవితాలపై శని వ్యతిరేక భావనతో ఉంటే ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తుంటాలి. శనీశ్వరుడికి ఇష్టమైన మంగళ, శనివారాల్లో శనీశ్వరుడికి అభిషేకం చేశారు. నవధాన్యాలు సమర్పించాలి.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More