Ugadi : ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. 2025 మార్చి 30న ఉగాది రాబోతుండడంతో నూతన పంచాంగం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే ఆన్లైన్లో ఇప్పటికే పంచాంగం గురించి చాలామంది తెలుసుకున్నారు. కానీ కొందరు ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన దానిని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. వీరిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కొత్త పంచాంగం ప్రకారం కొందరి జీవితాల్లో జరిగే సంఘటనల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది రాజకీయ నాయకులకు.. ఆర్థిక రంగాల వారికి ఎలా ఉంటుందో తెలియజేశాడు. ఆయన చెప్పిన ప్రకారం.. ఎవరికి ఎలా ఉందంటే?
Also Read : ఉగాది పంచాంగం.. అదృష్టమంటే ఈ రాశుల వారిదే
తెలుగు సంవత్సరం ఉగాది రోజున ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కొత్త పంచాంగం ప్రకారం వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం కొనసాగనుంది. అయితే మార్చి 30న ఉగాది సందర్భంగా షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. 2019లో డిసెంబర్లో షష్ఠ కూటమి ఏర్పడింది. ఈ కారణంగా ఆ సమయంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందింది. అయితే ఇప్పుడు కూడా షష్ఠ కూటమి ఏర్పడడంతో ఏదో వ్యాధి ప్రభలే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి లివర్, కళ్ళు, చర్మానికి సంబంధించినవి ఉంటాయని చెబుతున్నారు.
అలాగే విశ్వా వసు నామ సంవత్సరానికి అధిపతిగా రవి ఉన్నారు. రవి అంటే సూర్యుడు. సూర్యుడు, శనితో కలిసి మీనరాశిలో ప్రయాణం చేయనున్నాడు. దీంతో కుజుడు, గురువు, రాహు, కేతువు గ్రహాలన్నీ మీన రాశిలోనే ఉండబోతున్నాయి. దీంతో ప్రపంచంలో అనుకొని సంఘటనలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయ రంగంలోని వారికి ఈ ఏడాది కొంచెం ఆందోళన కరంగానే ఉంటుందని చెప్పవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సూర్యుడు ప్రభావం వల్ల రాజకీయ రంగాల్లో ఉన్నత పదవుల్లో ఉండే వారికి కొన్ని కష్టాలు తప్పవని అంటున్నారు. వీరికి స్థిరత్వం లోపించి పదవి గండం ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు. ప్రజలలో రాజుపై విశ్వాసం సన్నగిల్లుతుంది. అంటే ప్రస్తుత కాలం ప్రకారం ఒక రాష్ట్రానికి సీఎం లేదా ఒక దేశానికి పీఎం వంటి వారికి అన్నమాట. అంతేకాకుండా చాలామందికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశ విదేశాల మధ్య యుద్ధాలు ఏర్పాడే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో సాంప్రదాయాల్లో తేడాలు రావడంతో ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది.
శని ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో మకరం, మీనం, కుంభరాశిల వారికి కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రాశుల వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేసే పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉంటే వారు మౌనంగా ఉండడమే మంచిది. అనుకోని వివాదాలలో చిక్కుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో పదవికి గండం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే శని ప్రభావం తగ్గించడానికి కొన్ని పరిహారాలు చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం. ముఖ్యంగా హనుమంతుడి పూజ లేదా శని పూజ చేయడం వల్ల ప్రభావం తగ్గుతుంది.
Also Read : ఉగాది పంచాంగం.. ఏయే రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే?