Site icon OkTelugu

Today 22 March 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా డబ్బు..

Today 22 March 2026 Horoscope

Today 22 March 2026 Horoscope

Today 22 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి విభేదాలు ఏర్పడతాయి. అయితే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఆన్లైన్లో పెట్టుబడును పెట్టేవారు ఆలోచించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కొంతమందితో ఆర్థిక వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకొని ముందుకు వెళ్లాలి. అవసరం ఉన్నంత వరకే ఖర్చులు పెట్టాలి. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఆందోళనతో ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు కెరియర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపానులు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలను చేపడుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశంలు తక్కువగా ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. అదనపు వాదనల వల్ల కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడవచ్చు. పెద్ద ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రిస్కుతో కూడిన పనులు చేయకుండా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది. ఆఫర్లను నమ్మకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారులకు నష్టం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దలను సలహా అడగాలి. ఒత్తిడి నుంచి జయించేందుకు విహారయాత్రలకు వెళ్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీంతో మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపట్టి బిజీగా మారిపోతారు. అనవసరమైన సమస్యల్లోకి తల దూర్చొద్దు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అదనపు బాధ్యతలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. సవాలుతో కూడిన ప్రాజెక్టులను తీసుకుంటారు.

Exit mobile version