spot_img
Homeఆధ్యాత్మికంToday 21 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారి ఇంట్లో డబ్బు ప్రవాహం..

Today 21 March 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారి ఇంట్లో డబ్బు ప్రవాహం..

Today 21 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారి ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. మరి కొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇంటికి చుట్టాల రాకతో సందడిగా మారుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వ్యాపారులు పెద్దలను సంప్రదిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం. డబ్బు వృధాగా ఖర్చు అయ్యే అవకాశం. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారాలు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ధనయోగం ఉండనుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. కొందరికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలను పొందవచ్చు. అయితే ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.

.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కొత్తగా ఏదైనా పనిని మొదలు పెడితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు డబ్బు ప్రవాహం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉండడంతో కొత్తగా పెట్టుబడును పెడతారు. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పెట్టుబడులతో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులను నియంత్రించి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులకు కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్ లెటర్ వస్తుంది. వ్యాపారులు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లడంతో ఎలాంటి నష్టం లేకుండా ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లడం అంత మజీద్ కాదు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు జీవిత భాగస్వామి అండదండలు ఉంటాయి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్స్ ఇస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగివస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. స్నేహితుల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారులకు తోటి వారి అండదండలు ఉంటాయి. దీంతో గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అయితే కొందరు చెడు మాటలు చెప్పే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని గ్రహిస్తూ ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version