Homeఆధ్యాత్మికంToday 2 May 2026 Horoscope: ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం తలుపు...

Today 2 May 2026 Horoscope: ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం తలుపు తట్టి అవకాశం.. ఇందులో మీది ఉందో చెక్ చేసుకోండి..

Today 2 May 2026 Horoscope: జ్యోతిష శాస్త్ర ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది. మరికొన్ని రాశుల వారికి ప్రయాణాలు చేస్తే సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టే వారికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో కుటుంబ సభ్యుల మద్దతు పొందాలి. విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సలహా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మీకు సంబంధం లేని సమస్యల గురించి ఆలోచించకపోవడమే మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో చేపట్టిన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గలనీయంగా పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం లభించడం వల్ల అందరి ఆదరణ పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై కన్నీసి ఉంచాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతో బిజీగా మారిపోతారు. నైపుణ్య ప్రదర్శనతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి జీవితం ఈరోజు ఆనందంగా ముందుకు వెళుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో మెరుగ్గా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా డబ్బు అడిగితే ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తే వాటిని వెంటనే పూర్తి చేస్తారు. ఉన్నట్లుండి వ్యాపారులకు ఎక్కువగా లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు శుభవార్తను వింటారు. వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వీరికి శని దేవుడి అనుగ్రహం ఉండడంతో అధికంగా డబ్బు అందుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు దానధర్మాలు చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version