Today 11 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం ఉండడంవల్ల గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): కొన్ని పనుల నిమిత్తం ఈ రాశి వారు ఈ రోజు సుదూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాలతో వ్యాపారం చేసేవారికి ఈరోజు అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలు చేయకుండా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులు తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. తోటి వారితో సంయమనం పాటించాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. శక్తికి మించిన పనులు చేయడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల మద్దతుతో ఆర్థికపరమైన విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. విదేశీ వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకొని ఆదాయం సమకూరుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో మొదలుపెట్టిన పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు అధికంగా కలగనున్నాయి. పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు తమ పనులతో కాస్త ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో మొదలుపెట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఎప్పుడూ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు చేసే వ్యాపారం ఈరోజు అభివృద్ధి చెందుతుంది. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు వస్తాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. కొన్ని పనులు చేయడానికి స్నేహితుల మద్దతు ఉండడంతో విజయవంతంగా పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన అవకాశాలు రానున్నాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వీరికి శని దేవుడి అనుగ్రహం ఉండడం వల్ల ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.