Homeఆధ్యాత్మికంToday 10 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అదృష్టం తలుపు...

Today 10 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అదృష్టం తలుపు తట్టనుంది..

Today 10 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల సపోర్టుతో పదోన్నతి వచ్చే అవకాశాలు ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తవుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో ఉన్న ఆస్తి ఇప్పుడు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఖర్చులు చేయాలి. అనవసరంగా ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెద్దల అండ దండలు ఉండడంతో వ్యాపారాలు లాభాలు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ఆదాయం పెరుగుతుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. కష్ట సమయాల్లో రైతులు ఆదుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి లక్ష్మీదేవి అండదండలు ఉండడంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. గతంలో చేపట్టిన పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు పాత మిత్రులు కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో శుభకార్యం ఉండడంతో బిజీగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో దూరప్రాయణాలు చేస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుంచి ధన సహాయం అందుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version