Homeఆధ్యాత్మికంToday 1 July Horoscope: ఈ రాశి ఈరోజు వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా?

Today 1 July Horoscope: ఈ రాశి ఈరోజు వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా?

Today 1 July Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పాల్గొని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు చానికూలమైన వాతావరణ ఉంటుంది. ముఖ్యమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ పనులు పూర్తిగా అవడానికి తోటి వారు సహాయం చేస్తారు. ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్తారు. ఇతరులతో సంయోగం పాటించాలి. వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రియమైన వారితో సమయానికి కేటాయిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తికావడానికి స్నేహితుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులకు కెరియర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు. దీనిపై ప్రత్యేకంగా చర్చిస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్తగా అవకాశాలను పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. శాతవాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రభుత్వ కార్యాలయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అయితే వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల విషయంలో ఆందోళన చెందుతారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇబ్బందులు పడతారు. ఇటువంటి సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో వ్యాపారం చేస్తే లాభాలు పొందుతారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న విషయాలలో పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లల విషయంలోకి ఇరగ నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యా రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ఉద్యోగుల ప్రాజెక్టులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వీఆర్ యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆటంకాలు లేకుండా పనులు జరుగుతాయి. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి విషయాన్ని పూర్తిగా వినాలి. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఒకేసారి ఎక్కువ పనులు చేయడం వల్ల కాస్త ఇబ్బందులకు గురవుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. గతంలో చేసిన తప్పులను చిగురుపాటి నేర్చుకుంటారు. విద్యార్థులు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే వారి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రణాళికలు వేస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సదా తీసుకోవాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఏదైనా వివాదం తలెత్తితే వెంటనే పరిష్కరించుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. వాటిని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల ఒకరి గొడవ కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు కెరీర్ పై కీలకని నిర్ణయం తీసుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular