Rashi Phalalu: ఈ రాశివారికి ఓ ముఖ్యమైన సమాచారం అందుతుంది… ఈరోజు 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలోజాగ్రత్తలు పాటించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

Written By: Suresh, Updated On : December 6, 2023 8:25 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 6న బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సింహ, వృషభం రాశుల వారికి అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామితో ఎక్కువగా వాదనలకు దిగకండి. ఉద్యోగులు కార్యాలయలంలో పదోన్నతులు పొందే అవకాశాలు ఎక్కువ.

వృషభం:
కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలోజాగ్రత్తలు పాటించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథునం:
ఈ రాశివారికి ఓ ముఖ్యమైన సమాచారం అందుతుంది. దీంతో సంతోషాన్ని ఉంటారు. అయితే ప్రయాణాలు చేసేవారు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యానికి ప్లాన్లు వేస్తారు. జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:
ఈ రాశివారు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులు తెలివితేటలతో చేయాల్సి ఉంటుంది. చిన్ని చిన్న తప్పులపై పెద్ద రాద్దాంతం చేయొద్దు.

సింహం:
ఈ రాశివారికి ఈరోజు అనుకూల సమయం. ఇతరులతో సమయాన్ని వృథా చేయకుండా ఆర్థిక ప్రణాళికలు వేయడం ద్వారా అధిక లాభాలు పొందుతారు.

కన్య:
సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి ప్లాన్లు వేస్తారు. గతంలో పెండింగులో ఉన్న సమస్యలు ఈరోజుతో సమసిపోతాయి.

తుల:
కొన్ని విషయాల్లో ఎవరికీ వాగ్దానం చేయొద్దు. కొన్ని శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాల పనులతో బిజీగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.

వృశ్చికం:
ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు:
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇతరుల సలహాలు తీసుకోవాలి.

మకరం:
కొందరికి శ్రమ విపరీతంగా పెరుగుతుంది. కోర్టు కేసులు ఉంటే పరిష్కారం అవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం:
ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు అవకాశం. ఇంట్లో సమస్యలు పెరిగే అవకాశం. ప్రియమైన వారితో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను ఎక్కువగా నమ్మొద్దు.

మీనం:
ఆదాయం పెరుగుతుంది. అనుభవం ఉన్న వారి నుంచి కొన్ని సలహాలు తీసుకుంటారు. ఎవరికైనా బహుమతిని కొనాలని అనుకుంటే వారి అభిప్రాయాలను తెలుసుకోండి.