Horoscope Today: ఈ రాశి వారికి అనుకోకుండా ధనం వచ్చి చేరుతుంది..

2025 మే 16 గురువారం రోజున ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో ఓ రాశి వారి ఆర్థికి పరిస్థితి మెరుగుపడుతుంది.

Written By: Chai Muchhata, Updated On : May 16, 2024 8:31 am

Horoscope

Follow us on

Horoscope Today: 2025 మే 16 గురువారం రోజున ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో ఓ రాశి వారి ఆర్థికి పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోకుండా ధన వచ్చి చేరుతుంది. మరో రాశి వారు కొన్ని విషయాల పట్ల తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బంధువుల నుంచి కొన్ని వస్తువులు పొందుతారు. కొందరు వ్యక్తుల నుంచి గిప్ట్ పొందుతారు. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఓ సమాచారం అందుకుంటారు.

వృషభ రాశి:
వ్యక్తిగతంగా గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొన్ని విషయాల్లో నిరుత్సాహం ఉంటుంది. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.

మిథున రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోకుండా ధనం వచ్చి చేరూతుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. ఆస్తికి సంబంధించిన ఓ సమాచారం అందుకుంటారు.

కర్కాటక రాశి:
కొత్త ప్రాజక్టులు మొదలుపెడుతారు. వేతనాలు అందుకునేవారుశుభవార్త వింటారు. కొన్ని ప్రణాళికల వల్ల అధిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహారాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులలో కొందరిని నమ్మొద్దు. కొన్ని పనుల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అనవసర వాదనలకు దిగొద్దు.

కన్య రాశి:
కొన్ని నిర్ణయాలు వ్యతిరేకంగా మారుతాయి. వ్యాపారులు నష్టాలన్ని చూస్తారు. కొత్త పెట్టుబడులు ప్రస్తుతానికి మంచివి కావు. ప్రేముకులకు అనుకూలమైన రోజు.

తుల రాశి:
విద్యార్థులు కెరీర్ కు సంబంధించి ఓ శుభవార్త వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. లక్ష్యాల పట్ల ఫోకస్ చేస్తారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.

వృశ్చిక రాశి:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో వ్యవహరించాలి. అనవసరవ వాదనలు చేయొద్దు. ఖర్చులు పెరుగుతాయి. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి.

ధనస్సు రాశి:
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదాయం పెరగుుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.

మకర రాశి:
కొన్ని పనుల వల్ల బిజీగా ఉంటారు. పర్సనల్ విషయాలు కొత్త వ్యక్తులకు చెప్పొద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారితో ఉల్లాసంగా గడుపుతారు.

కుంభరాశి:
డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మీనరాశి:
నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంపదను పెంచుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు.