TANA cultural events : తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా తానా ఆధ్వర్యంలో బాపట్ల నాగులపాలెంలోనూ సేవలందించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
బాపట్ల నాగులపాలెంలో ఉన్న నాగుబడి రంగయ్య, అచ్చమ్మ బధిరుల ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రత్యేక, సాంస్కృతిక కార్యక్రమాలను తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గారు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు.
పాఠశాల వ్యవస్థాపకుడు సుబ్బారావు నాగుబడి గారితో కలిసి విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారి సృజనాత్మక నైపుణ్యాలను అభినందించారు.
యార్లగడ్డ వెంకట రమణ గారు మాట్లాడుతూ.. వైకల్యం అనేది కేవలం శరీరానికి మాత్రమేనని మేధాశక్తి కాదని కనుక విద్యార్థుల భవిష్యత్ తరాలకు చక్కనిచేయుత ను ఇచ్చేంతగా ఎదగాలని వారినిఉద్దేశించి మాట్లాడారు.