Sarath Babu- Rama Prabha: రమాప్రభ-శరత్ బాబు… ఎవరు ఎవరిని మోసం చేశారు?

శరత్ బాబు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. రమాప్రభతో ఆయన వైవాహిక బంధం వివాదాస్పదంగా ముగిసింది. వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.

  • Written By: SRK
  • Published On:
Sarath Babu- Rama Prabha: రమాప్రభ-శరత్ బాబు… ఎవరు ఎవరిని మోసం చేశారు?

Sarath Babu- Rama Prabha: నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఇటీవల శరత్ బాబు ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయన్ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం చికిత్స పొందుతూ శరత్ బాబు మరణించారు. ఆయన శరీరం మొత్తం విషత్యులమైనట్లు వైద్యులు తెలిపారు. దీంతో ప్రధాన అవయవాలైన కాలేయం, గుండె, కిడ్నీ పని చేయకుండా పోయాయి. దీంతో మరణం సంభవించిందని వెల్లడించారు.

71 ఏళ్ల శరత్ బాబు 250కి పైగా చిత్రాల్లో నటించారు. శరత్ బాబు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. 1973లో విడుదలైన రామరాజ్యం మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, సీతాకోక చిలుక, ఇది కథ కాదు. సాగర సంగమం, సంసారం ఒక చదరంగం చిత్రాలు ఆయనకు ఎనలేని పేరు తెచ్చాయి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణ పాత్రలు చేశారు. శరత్ బాబు సక్సెస్ఫుల్ కెరీర్ అనుభవించాడు. ఆయన చివరి చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ కృష్ణ రోల్ చేశారు.

కాగా శరత్ బాబు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. రమాప్రభతో ఆయన వైవాహిక బంధం వివాదాస్పదంగా ముగిసింది. వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలోనే రమాప్రభకు శరత్ బాబు దగ్గరయ్యారు. 1974లో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. శరత్ బాబు అప్పుడు పరిశ్రమకు కొత్త. నేను వెల్ సెటిల్డ్. పక్కా ప్రణాళిక ప్రకారం నాకు దగ్గరయ్యాడు. నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నాడు. నాతో పదేళ్ల కాపురం అతనికి అవసరం మాత్రమే అని రమాప్రభ విమర్శలు చేశారు.

ఈ విమర్శలకు శరత్ బాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆమె నుండి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. పైగా 60 కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ ఆమె, ఆమె తమ్ముడు పేరున రిజిస్టర్ చేయించాను అన్నారు. నాది చిన్న వయసు. నాకంటే 7 ఏళ్ళు పెద్దదైన రమాప్రభను నేను వివాహం చేసుకున్నాను. నాకు అప్పుడు బయట ప్రపంచం తెలియదు. చెప్పాలంటే ఆమెతో నాది పెళ్లే కాదు. అది ఒక కలయిక అంతే అన్నారు. శరత్ బాబు రెండో వివాహం చేసుకోగా, అది కూడా నిలబడలేదు.

సంబంధిత వార్తలు