కరోనాతో స్పెయిన్ యువరాణి మృతి

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ 200పైగా దేశాలకు సోకింది. కరోనా దాటికి అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా వంటి అగ్రదేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా మహమ్మరితో స్పెయిన్ యువరాణి మరియా థెరిసా(86) మృతిచెందింది. కరోనా వైరస్ కు ఆమె చికిత్స చేయించుకుంటున్నప్పటికీ మరియా థెరిసా మృతిచెందాడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. స్పెయిన్ యువరాణి […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనాతో స్పెయిన్ యువరాణి మృతి

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ 200పైగా దేశాలకు సోకింది. కరోనా దాటికి అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా వంటి అగ్రదేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా మహమ్మరితో స్పెయిన్ యువరాణి మరియా థెరిసా(86) మృతిచెందింది. కరోనా వైరస్ కు ఆమె చికిత్స చేయించుకుంటున్నప్పటికీ మరియా థెరిసా మృతిచెందాడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది.

స్పెయిన్ యువరాణి మరియా థెరిసా మృతివార్తను ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డి బోర్బన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ప్రపంచంలోని ఒక రాజ కుటుంబం నుంచి కరోనాతో మృతిచెందాడం ఇదే తొలిసారి. యూరోపియన్ దేశాల్లో ఇటలీ తరువాత కరోనాతో స్పెయిన్ ఎక్కువగా ప్రభావితమైంది. కరోనా మహమ్మరికి ఇటలీలో మరణమృదంగం కొనసాగుతుండగా స్పెయిన్ లోనూ అంతకంతకు కరోనా ప్రభావం తీవ్రరూపం దాల్చింది. దీంతో స్పెయిన్ కరోనా దాటికి అతలాకుతులం అవుతోంది. రెండ్రోజుల క్రితం మాడ్రిడ్‌లో స్పెయిన్ యువరాణి మరియా థెరిసాకు అంత్యక్రియలు జరిగాయి. మరియా థెరిసా పారిస్‌లో 1933 లో జన్మించారు.

తాజాగా ప్రపంచంలో కరోనా పాజిటివ్ 6లక్షలకు పైగా నమోదయ్యాయి. 27వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా కరోనా అగ్రరాజ్యాన్ని బెంబెలెత్తిస్తుంది. అమెరికాలో ఏకంగా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కరోనా కట్టడికి ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

కరోనా వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తుంది. దీంతో ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. స్వీయనియంత్రణ పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలగమని చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు