
Sonu Sood
Sonu Sood: నటుడు సోనూ సూద్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో తన అనుభవాలను పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెట్స్ లో ప్రతి ఒక్కరూ నిద్రపోవడం తనను షాక్ కి గురి చేసిందని చెప్పుకొచ్చారు. గతంలో నేను మదురై లో షూటింగ్ చేస్తున్నాను. అది ఓ సౌత్ ఇండియా మూవీ. లంచ్ అనంతరం ప్రతి ఒక్కరూ నిద్ర పోతున్నారు. ఒక గంట లంచ్ బ్రేక్. 20 నుండి 25 నిమిషాల్లో భోజనం చేయడం పూర్తి చేసి ఒక మూలకు వెళ్లి నిద్రపోతున్నారు. అలా అందరూ చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సెట్స్ లో ఎందుకు నిద్రపోతున్నారని నేను ఒకతన్ని అడిగాను. ఈ చిన్న కునుకు మరింత ఎనర్జీగా పని చేసేందుకు సహాయపడుతుంది. లంచ్ అనంతరం కాసేపు నిద్రపోవడం ఇక్కడ కల్చర్ అని అతను చెప్పాడు, అని సోనూ సూద్ మీడియాతో చెప్పారు.
ఒక సినిమా నిర్మించడంలో కూడా చాలా ప్రణాళికా బద్దంగా ఉంటారని ఆయన కొనియాడారు. షూటింగ్ మొదలుపెట్టిన రోజే విడుదల తేదీ లాక్ చేస్తారు. సౌత్ ఇండియాలో ఆర్గనైజ్డ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. వాళ్ళతో పని చేయడం అదృష్టంగా భావిస్తాను,అన్నారు. అక్కడ సన్ రైస్ షాట్ అని ఒకటి ఉంటుంది. సూర్యుడు ఉదయించకముందే కొన్ని షాట్స్ పూర్తి చేస్తారు. 5:30 గంటలకు సెట్స్ లోకి వచ్చి 6:30 గంటల కల్లా కొన్ని షాట్స్ తెరకెక్కిస్తారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. పని ముఖ్యం. పని తర్వాతే భోజనం అనేది వారి సిద్ధాంతం అని సౌత్ పరిశ్రమ గురించి గొప్పగా చెప్పారు.
సోనూ సూద్ సౌత్ ఇండియాలోనే నటుడిగా ఎదిగారు. ముఖ్యంగా టాలీవుడ్ లో విలన్ గా అనేక చిత్రాల్లో నటించారు. సూపర్, అతడు, అరుంధతి వంటి చిత్రాలు ఆయనకు బ్రేక్ ఇచ్చాయి. గత ఏడాది సోనూ సూద్ ఆచార్య మూవీలో నటించారు. చిరంజీవి-రామ్ చరణ్ ల ఈ మల్టీ స్టారర్ కి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఆచార్య అనుకున్న స్థాయిలో ఆడలేదు.

Sonu Sood:
కాగా సోనూ సూద్ కరోనా సమయంలో మానవతావాదిగా అవతరించాడు. దేశ ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. లాక్ డౌన్ కారణంగా అనేక నగరాల్లో కూలీలు చిక్కుకుపోయారు. ఉపాధి లేక సొంత ఊళ్లకు వెళ్లలేక ఇక్కట్లు పాలైన కూలీలను తమ ఊళ్లకు చేర్చారు. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి వారి గమ్యాలకు పంపారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఎలాంటి అభ్యర్థన చేసుకున్నా వారి అవసరాలు తీర్చాడు. సోనూ సూద్ ని కలియుగ దైవంగా జనాలు పూజించారంటే అతిశయోక్తి కాదు.