Chandrababu Song: బాబున్నాడని.. మాకేం కాదని..’ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాట
చంద్రబాబుకు రిమాండ్ విధించి దాదాపు పక్షం రోజులు సమీపిస్తున్నాయి. న్యాయస్థానాల్లో సైతం ఊరట దక్కకపోవడంతో టిడిపి శ్రేణులు ఆందోళనను తీవ్రతరం చేశాయి.

Chandrababu Song: ఆ మధ్యన నాగార్జున నటించిన “నేనున్నాను” సినిమా గుర్తుంది కదూ. ఆ సినిమాలో ” నేనున్నానని నీకేం కాదని”అన్న సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఆపాటనే టిడిపి శ్రేణులకు జత కలిపి వైసిపి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది.మేముండగా చంద్రబాబుకు ఏమీ కాదని అర్థం వచ్చేలా ఉండే ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు పలు పాత కేసులను సైతం తిరగదోడుతూ రిమాండ్ కొనసాగేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నాయి.
చంద్రబాబుకు రిమాండ్ విధించి దాదాపు పక్షం రోజులు సమీపిస్తున్నాయి. న్యాయస్థానాల్లో సైతం ఊరట దక్కకపోవడంతో టిడిపి శ్రేణులు ఆందోళనను తీవ్రతరం చేశాయి. రిలే నిరాహార దీక్షలతో పాటు సంతకాల సేకరణ, పోస్ట్ కార్డు ఉద్యమం, కొవ్వొత్తుల ర్యాలీ వంటివి చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని నమ్మకంగా చెబుతున్నాయి.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ తో పాటు అచ్చెనాయుడు అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయనను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారని చర్చ నడుస్తోంది. నిన్న హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టి వేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టారు. టిడిపి కీలక నాయకుల నుంచి కిందిస్థాయి నాయకులు వరకు చంద్రబాబును విడుదల చేయాలని సంతకాలు చేశారు. పోస్ట్ కార్డు ఉద్యమాలు సైతం చేపట్టారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, యనమల రామకృష్ణుడు, పట్టాభి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితరులు సంతకాలు చేశారు. ఆ వీడియోను నేనున్నాను అంటూ పాటను జత చేసి వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తుంది. ఇది పెద్ద ట్రోల్ అవుతోంది. తరువాత అరెస్ట్ లోకేష్, అచ్చెనాయుడు అని అర్థం వచ్చేలా సాగిన ఈ పాట.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేటిజెన్లతో పాటు వైసీపీ శ్రేణులు విభిన్నంగా స్పందిస్తున్నాయి.
చంద్రబాబు గారి కోసం బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సూపర్ గా ఉంది.#CorruptionKingCBN #CorruptBabuNaidu #SkillScamExposed pic.twitter.com/zV1mKxRqyh
— Anitha Reddy (@Anithareddyatp) September 22, 2023
