Bigg Boss 6 Telugu Ghost : బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు ఫినాలే వీకెండ్ కి ఒక్క అడుగు దూరంలో ఉండడంతో టాస్కులు చాలా కఠినతరంగా మారిపోయాయి.. గతంలో టాస్కుల ద్వారా క్యాష్ ప్రైజ్ లో 12 లక్షల రూపాయిలు పోగొట్టుకున్న కంటెస్టెంట్స్ కి మళ్ళీ అది తిరిగి సంపాదించుకునే అరుదైన అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు.. వివిధ రకాలైన టాస్కుల ద్వారా ఈ డబ్బులను తిరిగి సంపాదించుకోవచ్చు. నిన్న జరిగిన టాస్కులో కంటెస్టెంట్స్ లక్ష రూపాయిలను గెలుచుకోవడంలో విఫలం అవ్వగా..ఈరోజు మరికొన్ని టాస్కులను నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్.
ఇదంతా పక్కన పెడితే రాత్రి పడుకునే సమయంలో విచిత్రమైన గొంతుతో భయానకంగా ఒక శబ్దం రావడంతో కంటెస్టెంట్స్ అందరూ బెదిరిపోతారు.. దానికి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది..ఈ ప్రోమో లో దెయ్యంని చూసి కంటెస్టెంట్స్ అందరూ బెదిరిపోవడం మనం గమనించొచ్చు .
ముందుగా శ్రీ సత్య తన తోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ‘అందరం కూర్చున్నాము.. ఫుల్ పార్టీ చేసుకున్నాం..ఆ తర్వాత నేను వెళ్లి నిద్రపోయాను..మా దాంట్లో ఉన్న ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పిలుస్తుంటే విచిత్రమైన సౌండ్స్ చేసుకుంటూ’ అని చెప్తుంది.. అప్పుడు పెద్దగా ఒక్కరు దెయ్యం లాగా నవ్వుతారు.. అది విని శ్రీ సత్య భయపడి శ్రీహాన్ దుప్పట్లోకి దూరిపోతుంది.. అప్పుడు ఆది రెడ్డి ‘ఈరోజు రాత్రి నా దగ్గరకి దెయ్యం రమ్మను’ అంటూ చిటికెలు వేస్తూ ఏదో చెప్పబోతాడు..అప్పుడు కీర్తి ‘ఏమి చేస్తారు’ అని అడుగుతుంది.
వెంటనే ఏదో విచిత్రమైన ఆకారం చూసి కంటెస్టెంట్స్ అందరూ పారిపోయారు. బాత్రూం లో దాక్కుంటారు..చూడడానికి ఎంతో సరదాగా ఫన్ తో సాగిపోయిన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది..ఒక్కపక్క సీరియస్ టాస్కులు జరుగుతుండగా మరో పక్క ఇలాంటి ఫన్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండేందుకు బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.