R. Krishnaiah: హైదరాబాద్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శశాంక్ బీసీ సంఘం నాయకుడు ఆర్ .కృష్ణయ్య ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభసభ్యుడిగా ఎంపికైన ఆయన్ను బీసీ భవన్ లో పసుపులేటి శశాంక్ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. ఈ సందర్బంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శశాంక్ మాట్లాడుతూ “ఆర్. కృష్ణయ్య అన్న ప్రతినిత్యం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతూ 40 ఏళ్లుగా అనేక సేవలందించారని చెప్పారు. ఉద్యమ సందర్భంలో పోరాటాలు, నిర్బందాలు ఎదుర్కొని నిలబడిన నాయకుడు మన కృష్ణయ్య అని పసుపులేటి శశాంక్ పేర్కొన్నారు. బడుగుల నాయకుడికి ఆంధ్ర ప్రదేశ్ తరపున పెద్దల సభకు పంపడం పట్ల దేశంలో ఉన్న బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం,వైసిపి అధినేత వైస్ జగన్ కు యావత్ బీసీ సమాజం కృతజ్ఞతలు తెలుపుతోందని, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శశాంక్ తెలిపారు.ఈ కార్యక్రమం లో గుజ్జా కృష్ణ, జై కృష్ణ మంచాల, పి.శివ, అమిత్ కర్నీ, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

R. Krishnaiah, Shashank

Tribute To Krishnaiah

RajyaSabha Candidate R. Krishnaiah

Krishnaiah
Also Read: Heroine Anjali: హీరోయిన్ అంజలిని దారుణంగా మోసం చేసి ఆర్థికంగా దెబ్బ తీసింది ఎవరో తెలుసా?