Cyber Fraud : లైక్ కొట్టి రూ.19 లక్షలు పోగొట్టుకుంది.. సైబర్ వలకు చిక్కిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!
ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12,95,000 కట్టాలని తేల్చిచెప్పారు. లేనిపక్షంలో కట్టిన డబ్బు తిరిగి రాదని ఖరాకండిగా మోసగాళ్లు చెప్పారు. అప్పటికే రూ.19 లక్షలు చెల్లించి మోసపోవడం, ఇంకా చెల్లించే స్థోమత లేకపోవడంతో నిరాకరించింది. ఆ డబ్బులు వచ్చే అవకాశాలు లేవని, మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది.

Cyber Fraud : ఒకడేమో బ్యాంకు అధికారిలా ఫోన్ చేసి ఖాతాను అప్‌డేట్ చేస్తామని ఓటీపీ చెప్పమంటాడు. ఇంకొకడు ఫేస్‌బుక్‌లో లింక్ పంపి.. క్లిక్ చేయమని చెప్పి ఉన్న డబ్బును ఊడ్చేస్తాడు.. మరొకడు ఓఎల్‌ఎక్స్‌లో వాహనం అమ్మకానికి పెట్టి రూ.లక్షలు కొల్లగొడతాడు.. ఇలా ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా మోసపోయామన్న ఆవేదనలు తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా ‘ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్‌గా ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయండి.. భారీగా సంపాదించే అవకాశం ఉంది’.. అని కేటుగాళ్లు పెద్ద ఎత్తున యువతకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు