
Deepika Pilli
Deepika Pilli: యాంకర్ గా ఎదిగిన సోషల్ మీడియా సెలబ్రిటీ దీపికా పిల్లి. అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ లేడీ పలు బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. దీపికా పిల్లి టిక్ టాక్ యాప్ వేదికగా పాపులారిటీ తెచ్చుకున్నారు. టిక్ టాక్ లో దీపికా పిల్లికి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఆమె వీడియో కోసం పడి చచ్చేవాళ్ళు. అనూహ్యంగా టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ చేయడంతో దీపికా నిరాశ చెందారు.
అయినప్పటికీ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులోకి వచ్చారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అలరించారు. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో ఆమె బుల్లితెరకు ప్రమోట్ అయ్యారు. పలు షోలలో దీపికా పిల్లికి అవకాశాలు వచ్చాయి. ఆమె కెరీర్ ని ఢీ సీజన్ 13 మలుపు తిప్పింది.
అనూహ్యంగా దీపికా పిల్లి పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 13 యాంకర్ గా అవకాశం దక్కించుకున్నారు. మరొక యాంకర్ రష్మీ గౌతమ్ తో కలిసి ఆ సీజన్ కి విపరీతమైన ప్రాచుర్యం తెచ్చారు. రష్మీ సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ చేయగా… హైపర్ ఆదితో దీపికా పిల్లి కెమిస్ట్రీ పంచింది. రష్మీ, దీపికా పిల్లి యాంకర్స్ గా చేసిన ఆ సీజన్ సూపర్ హిట్ అని చెప్పాలి.

Deepika Pilli:
కారణం తెలియదు కానీ ఢీ సీజన్ 14 నుండి దీపికా పిల్లితో పాటు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ లను తప్పించారు. అయినప్పటికీ దీపికాకు అడపాదడపా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఆహాలో ప్రసారమైన కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోకి దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జి కాగా, సుడిగాలి సుధీర్ మరో యాంకర్.

Deepika Pilli
దీపికా పిల్లికి సినిమా అవకాశాలు రావడం విశేషం. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి నటించారు. అనసూయ, సునీల్, విష్ణుప్రియతో పాటు పలువురు స్టార్ కమెడియన్స్ నటించిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లికి కూడా ఛాన్స్ దక్కింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తుంది. తాజాగా దీపికా పిల్లి ఒక షో కోసం గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతుండగా కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.