Karnataka Exit Polls 2023 : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి కలిసొచ్చిన సామాజికాంశాలు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీకి అటూఇటుగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుపొందే అవకాశాలున్నాయని, లేనిపక్షంలో ఎక్కువ సీట్లు సాధించే పార్టీగానైనా కాంగ్రెస్ నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Karnataka Exit Polls 2023 : కర్ణాటకలో ఎన్నికల ఘట్టం ముగిసింది. దాదాపు నెల రోజులపాటు ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు.. తాజాగా పోలింగ్ సరళిని అంచనా వేసే పనుల్లో ఉన్నాయి. ఎగెలిచే స్థానాలు.. ఓడిపోయే నియోజకవర్గాల లెక్కలు తీస్తున్నారు. అయితే పోలింగ్ ముగియగానే ఎగ్జిట్‌పోల్స్ బయటకు వచ్చాయి. కొన్ని అధికార బీజేపీ గెలుస్తుందని చెబితే.. మరికొన్ని కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. మొత్తంగా అన్ని సర్వేలు కర్ణాటకలో హంగ్ తప్పదని క్లారిటీ ఇచ్చాయి. ఈ సమయంలో ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు, సర్వేలు, ఊహాగానాలు, బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నాయి. మే 13న ఓటరు నాడి బయటపడుతుంది.
కర్ణాటకలో అధికారం పీఠం ఎక్కాలంటే ఏ పార్టీ అయినా 113 సీట్ల మ్యాజిక్ మార్క్‌ను దాటాల్సిందే. ఈ స్థితిలో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు 106–116 సీట్లు రావొచ్చని, బీజేపీ 79–89 సీట్లతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుందని, జేడీ(ఎస్) 24–34 సీట్లు సాధించవచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీకి అటూఇటుగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుపొందే అవకాశాలున్నాయని, లేనిపక్షంలో ఎక్కువ సీట్లు సాధించే పార్టీగానైనా కాంగ్రెస్ నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కి కలిసొచ్చిన సామాజికాంశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
