Sobhita Dhulipala : కూల్ గా ఉండే నాగ చైతన్య వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న ఈ అక్కినేని హీరో ఓ వర్గానికి టార్గెట్ అయ్యాడు. ముఖ్యంగా సమంత అభిమానులు ఆయన్ని ఇష్టపడటం లేదు. సమంతకు ఆయనేదో తీరని ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నారు. 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. వీరు విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ పలు వాదనలు తెరపైకి వచ్చాయి. సమంత, చైతూ ఇద్దరూ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కాగా కొద్ది నెలల క్రితం నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. విడాకులు తర్వాత శోభిత ధూళిపాళ్ళకు నాగ చైతన్య దగ్గరయ్యారని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించారు. ఇవన్నీ నిరాదరణ కథనాలు ఎవరో కావాలని సృష్టిస్తున్న వదంతులు అంటూ కొట్టిపారేశారు.
అయితే ఈ పుకారు మరోసారి వెలుగులోకి వచ్చింది. నాగ చైతన్య-శోభిత కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఈ ఫోటో ఆధారంగా చూపుతూ నాగ చైతన్య-శోభిత మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ కొందరు వాదిస్తున్నారు. నాగ చైతన్య బర్త్ డే జరుపుకున్న నెక్స్ట్ డే ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అయితే అది మార్ఫింగ్ ఫోటో… నాగ చైతన్య, శోభిత ఫోటోలు జతచేసి రూపొందించారని, చైతూ అభిమానులు వాదించారు.
నిజం ఏదైనా నాగ చైతన్య-శోభిత మధ్య ఏదో ఉందన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో శోభిత ధూళిపాళ్ల పేరు బాగా నానుతుంది. తెనాలిలో పుట్టిన తెలుగమ్మాయి శోభిత హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో గూఢచారి మూవీతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అడివి శేష్ తో మరోసారి మేజర్ మూవీలో జతకట్టారు. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ మూవీలో శోభిత కీలక రోల్ చేయడం విశేషం.
ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 చేస్తున్నారు. అలాగే స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ డైరెక్షన్ లో ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు. ఒక హిందీ చిత్రం ఆమె ఖాతాలో ఉంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత హాట్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. శోభిత లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా… ఈ అందానికే నాగ చైతన్య పడిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు.