Sobhan Babu – Nagma : అప్పటి ముచ్చట్లు : నగ్మా చేసిన పనికి చిర్రెత్తిపోయిన శోభన్ బాబు… నీ ఆస్తి విలువ నా బాత్రూమ్ ఖరీదు ఉండదంటూ!
Sobhan Babu – Nagma : సోగ్గాడు శోభన్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలుగొందారు. శోభన్ బాబుకు క్రమశిక్షణ గల నటుడిగా పేరుంది. ఆయన జీవితం పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. శోభన్ బాబు ఎందరికో గొప్ప సలహాలు ఇచ్చారు . డబ్బులు ఎలా మదుపులు చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కోట్ల విలువ చేసే సూచనలు చేశారు. ఇప్పటికీ చాలా మంది నటులు అప్పట్లో శోభన్ బాబు మాట విని […]

Sobhan Babu – Nagma : సోగ్గాడు శోభన్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలుగొందారు. శోభన్ బాబుకు క్రమశిక్షణ గల నటుడిగా పేరుంది. ఆయన జీవితం పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. శోభన్ బాబు ఎందరికో గొప్ప సలహాలు ఇచ్చారు . డబ్బులు ఎలా మదుపులు చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కోట్ల విలువ చేసే సూచనలు చేశారు. ఇప్పటికీ చాలా మంది నటులు అప్పట్లో శోభన్ బాబు మాట విని ఉంటే వందల కోట్లకు అధిపతి అయ్యేవాళ్లమని అంటున్నారు. భవిష్యత్ రియల్ ఎస్టేట్ దే అని నమ్మిన శోభన్ బాబు నటుడిగా సంపాదించిన ప్రతి రూపాయి భూమి మీద ఇన్వెస్ట్ చేశాడు.
షూటింగ్ కి సమయానికి హాజరయ్యే శోభన్ బాబు ఇతరులు కూడా అలానే క్రమశిక్షణగా ఉండాలని కోరుకునేవారు. కాగా హీరోయిన్ నగ్మా… ఇదే విషయంలో ఆయన ఆగ్రహానికి గురైందట. స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న రోజుల్లో నగ్మా ఓ చిత్రంలో శోభన్ బాబుకు జంటగా నటించారు. 1995లో విడుదలైన అడవి దొర చిత్రంలో వీరిద్దరూ జతకట్టారు.
శోభన్ బాబు-నగ్మాల మీద ఓ డ్యూయట్ చిత్రీకరించాల్సి ఉండగా… చైనా బోర్డర్లో గల అందమైన లొకేషన్ కి వెళ్లారట. షాట్ రెడీ చేసి అందరూ సిద్ధంగా ఉన్నారట. నగ్మా మాత్రం ఇంకా సెట్ కి రాలేదట. అరగంట, గంట చూసినా… నగ్మా రాలేదట. శోభన్ బాబు సహనంగా వేచి చూశారట. ఓ గంటన్నర తర్వాత నగ్మా తాపీగా సెట్స్ కి వచ్చిందట. ఎందుకు లేటైందని అడగ్గా… నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందట. దాంతో శోభన్ బాబు కోపం కట్టలు తెంచుకుందట.
నగ్మాను దగ్గరకు పిలిచి ‘నీ ఆస్థి విలువ మొత్తం ఎంత ఉంటుంది?’ అని అడిగారట. నగ్మా ఏదో ఒక అమౌంట్ చెప్పిందట. అది నా ఇంటి బాత్ రూమ్ ఖర్చుతో సమానం. ఆర్టిస్ట్ కి క్రమశిక్షణ అవసరం అని గట్టిగా చెప్పాడట. తర్వాత శోభన్ బాబు గురించి ఇతరులను అడిగి తెలుసుకొని నగ్మా ఆశ్చర్యపోయారట. శోభన్ బాబు వంటి సౌమ్యుడికి కూడా నగ్మా కోపం తెప్పించిందని టాలీవుడ్ వర్గాలు అప్పట్లో ప్రముఖంగా చెప్పుకున్నాయి. తర్వాత కూడా నగ్మా మీద అనేక ఆరోపణలు వచ్చాయి.
నగ్మా తెలుగులో నటించిన చివరి చిత్రం అల్లరి అల్లుడు. 2002లో విడువులైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి అత్తయ్య పాత్ర చేశారు. తర్వాత ఓ చిన్న మూవీలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నగ్మా రేంజ్ భోజ్ పురి చిత్రాలకు పడిపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. నగ్మా వివాహం చేసుకోలేదు.