Small Birds Long Beaks: పిట్ట కొంచెం.. ముక్కు ఘనం..
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కన్పిస్తుంది. ఇది స్పైడర్ హంటర్ కుటుంబానికి చెందినది. దీనికి రంగురంగుల ఈకలు ఉంటాయి. దీని ముక్కు కిందకు వంగి ఉంటుంది. దీని ముక్కు నాలుగు నుంచి ఏడు అంగుళాలు ఉంటుంది.

Small Birds Long Beaks: సాధారణంగా మనం పక్షుల గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు. లేదా చిన్న స్థాయి లో ఉన్న వారు అసాధారణ ప్రతిభ కనబరిచినప్పుడు “పిట్ట కొంచెం కూత ఘనం” అనే సామెత వాడుతుంటాం. కానీ ఈ పక్షుల విషయంలో ఆ సామెతను మార్చి వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. కానీ వాటి ముక్కు నిర్మాణం విషయానికి వచ్చేసరికి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అవి పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ ముక్కులు మాత్రం వాటి శరీర నిర్మాణ శైలిలో దాదాపు సగం ఉంటాయి. ఆర్నిథాలజిస్టుల (పక్షి శాస్త్ర నిపుణులు) పరిశీలనలో ప్రపంచంలో కొన్ని పక్షులు పరిమాణంలో చిన్నవిగా ఉండి.. వాటి ముక్కు ఆకారం పెద్దదిగా ఉన్నట్టు తెలిసింది. ఇంతకీ ఆ పక్షులు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
లాంగ్ బిల్ డౌట్చర్
ఇది తీర ప్రాంతంలో ఎక్కువ కన్పిస్తుంది. పొడవాటి ముక్కు కలిగి ఉంటుంది. ఇది 12 అంగుళాల వరకు పెరగుతుంది. 3 అంగుళాల వరకు బలమైన బిల్(ముక్కు) కలిగి ఉంటుంది. ఇది వాయవ్య కెనడా, పశ్చిమ అలస్కా, దక్షిణ మెక్సికో ప్రాంతాల్లో కన్పిస్తుంది. దీని ముక్కును జాగ్రత్తగా పరిశీలిస్తే దాని దేహ నిర్మాణంలో సగం ఉంటుంది.

Long Bill Deutscher
బిల్ట్ కింగ్ ఫిషర్
ఇది పొడవాటి ముక్కు కలిగి ఉంటుంది. ఇది పసుపు రంగు ఛాతి కలిగి ఉంటుంది. ఇది 13 అంగుళాలు ఉంటుంది. ఆసియా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కప్పులు, క్షీరదాలు, చిన్న చిన్న క్రస్టేషియన్లను తింటుంది. అమెరికాలోని అరిజోనాలో ఇవి విరివిగా కన్పిస్తాయి.

Built Kingfisher
రాక్ పెల్లర్స్ సన్ బర్డ్
ఇది రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కన్పిస్తుంది. ఇది స్పైడర్ హంటర్ కుటుంబానికి చెందినది. దీనికి రంగురంగుల ఈకలు ఉంటాయి. దీని ముక్కు కిందకు వంగి ఉంటుంది. దీని ముక్కు నాలుగు నుంచి ఏడు అంగుళాలు ఉంటుంది.

Rock Peller’s Sunbird
యూరోషియన్ యూపో
ఇది గోధుమ రంగులో ఉంటుంది. పొడవాటి ముక్కును కలిగి ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కన్పిస్తూ ఉంటుంది. ఇది 12 ఆంగుళాల వరకు పెరుగుతుంది. తన ముక్కు ద్వారా ఆహారా న్ని సేకరిస్తుంది. చిన్న చిన్న పురుగులు, లార్వాలను ఆహారంగా తీసుకుంటుంది.
రెడ్ బీయర్డ్ బీ ఈటర్
రెడ్ బీయర్డ్ బీ ఈటర్ ఈ పక్షి.. ఆగ్నేయాసియాలోని ఇండియన్ మలయన్ ప్రాంతంలో కన్పిస్తుంది. ఇది నారింజ, ఎరుపు రంగులో కన్పిస్తుంది. తేనెటీగలు, కందిరీగలను ఆహారంగా తీసుకుంటుంది.

Red bearded bee eater
విల్సన్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్
ఈ పక్షి నీలం, పసుపు, ఎరుపు, నలుగురంగులతో మిళితమై ఉంటాయి. వీటికి పొడవాటి ముక్కు ఉంటుంది. ఇవి కీటకాలు, లార్వాలు, చిన్న చిన్ని పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఇండోనేషియా ప్రాంతంలో కన్పిస్తాయి. ఇవి తమ పొడవాటి ముక్కు ద్వారా విత్తనాలను తింటాయి.

Wilson’s bird-of-paradise
స్వోర్డ్ బిల్డ్ హమ్మింగ్ బర్డ్
దక్షిణ ఆమెరికాలోని ఆండియాన్ ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి పొడవాటి ముక్కు, చిన్న తోక ఉంటుంది. పూల లోపలి తేనెను ఆహారంగా తీసుకుంటుంది. కీటక సంపర్కానికి తోడ్పడుతుంది.

Sword-billed hummingbird
రెడ్ హెడెడ్ వండ్రంగి పిట్ట
ఇది ఉత్తర అమెరికాలో కన్పిస్తుంది. ఇది పొడవాటి ముక్కును కలిగి ఉంటుంది. అట్లాంటిక్ సముద్రం, రాకీ పర్వతాలు, కెనడా, టెక్సాస్ ప్రాంతాల్లోనూ ఇవి విస్తారంగా ఉంటాయి. ఇది కీటకాలను, లార్వాలను ఆహారంగా తీసుకుంటుంది.
వైట్ హెడ్ వైట్ హుపో
ఇది ఆఫ్రికా దేశంలో కన్పిస్తుంది. ఎర్రటి పొడవైన ముక్కున కలిగి ఉంటుంది. ఇది చూడటానికి నీలం రంగులో కన్పిస్తుంది. చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. దీనికి ఉన్న చిన్న ప్రత్యేక ఆకర్షణగా కన్పిస్తుంది. అయితే మగ పక్షుల తల ముదురు నీలం రంగులో ఉంటుంది.

White head white hoopoe
