AP MLC Election Results: సాధారణంగా ఎవరైనా ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే ఏసీబీ అధికారులకు, కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని ఉన్నత సంస్థలకు ఫిర్యాదులు చేస్తారు. కానీ రాష్ట్రంలోని వైసీపీ సర్కారులోని ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు చేయాలంటే సాధారణ ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఎక్కడ ఏ కేసు పెట్టి వేధిస్తారు నన్ను భయం ఈ తరహా ఫిర్యాదులు జోలికి వెళ్ళకుండా చేస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఫిర్యాదులు జోలికి వెళ్లకుండా తమ ఎమ్మెల్యే అవినీతి కంపును బ్యాలెట్ బాక్స్ లోకి ఎక్కించారు. ఒకసారి పరిశీలిద్దాం.
బ్యాలెట్ బాక్సుల్లోకి అవినీతి చిట్టా..
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కొద్ది రోజుల కిందట జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా లభించిన పలు స్లిప్పుల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ మంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ పలువురు ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లో స్లిప్పులు వేయడం సర్వత్రా చర్చకు కారణమైంది. మామూలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అవినీతిని ముఖ్యమంత్రి కో, గవర్నర్ కో, రాష్ట్రపతి కో ఫిర్యాదు చేయడం చూస్తుంటాం. అయితే రాష్ట్రంలో ఈ తరహా ఫిర్యాదులను ఉపేక్షించే పరిస్థితిలో వైసీపీ నాయకులు లేరు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే కేసులు పెట్టి వేధిస్తారు అన్న భయంతో చాలామంది భయంతో ఉంటున్నారు. అటువంటి వారంతా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలను ఎంచుకున్నారు.

AP MLC Election Results
మంత్రి అవినీతి చిట్టా..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా లభించిన పలు సీట్లలో శ్రీకాకుళం జిల్లాలోని ఒక మంత్రికి సంబంధించిన అవినీతి వ్యవహారాలపై రాసి ఉన్నాయి. ఆయా సీట్లను తెరిచి చూసిన ఏజెంట్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. సదరు మంత్రివర్యులు ఆ నియోజకవర్గంలో చేస్తున్న అవినీతి చిట్టాను పలువురు స్లిప్పుల్లో రాసి పడేశారు. వీటిని చూసిన ఏజెంట్లు ఫిర్యాదులకు గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారు చర్చించుకున్నారు. ఇక ఓట్ల స్లిప్పులో ఫిర్యాదు చేసిన సదరు మంత్రివర్యులు శ్రీకాకుళం జిల్లాలోని పలాస శాసనసభ్యులు సీదిరి అప్పలరాజు. స్థానికంగా ఈయన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ ఆ స్లిప్పుల్లో పలువురు ఓటర్లు రాసి పడేశారు.

AP MLC Election Results
ఫిర్యాదు కంటే.. బ్యాలెట్ బాక్స్ నయమని..
రాష్ట్రంలోని ఏ వైసీపీ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా మాట్లాడిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే మంత్రివర్యులు అవినీతిని ఎలాగైనా బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో పలువురు ఓటర్లు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికను మార్గంగా ఎంచుకున్నారు. తాము ఫిర్యాదు చేయదలచిన విషయాలను స్లిప్పుల్లో రాసి బ్యాలెట్ బాక్స్ లో పడేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఇవి బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సదరు మంత్రిపై చర్చలు నడుస్తున్నాయి. స్లిప్పులు వేసిన సదరు ఓటర్లను వాట్ యేన్ ఐడియా సర్ జీ అంటూ పలువురు కొనియాడుతున్నారు.