Sitara Remuneration: ఆ జ్యూవెలరీ యాడ్ కి సితార రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? మహేష్ ని కూడా దాటేసింది!

మహేష్ నట వారసురాలిగా డాన్స్ అంటే సితారకు బాగా ఇష్టం. యానీ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. సీతారకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ కూతురుగానే కాకుండా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసుకుంది. దాంతో కొన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు సితారను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునే ఆలోచన చేస్తున్నాయి.

  • Written By: Shiva
  • Published On:
Sitara Remuneration: ఆ జ్యూవెలరీ యాడ్ కి సితార రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? మహేష్ ని కూడా దాటేసింది!

Sitara Remuneration: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార వెరీ స్పెషల్. ఈ చిచ్చర పిడుగు పసిప్రాయంలోనే సంచలనాలు నమోదు చేస్తుంది. సితార వయసు చిన్నదైనా అవగాహన చాలా ఎక్కువ. ఆరేడేళ్ల వయసులోనే యూట్యూబ్ ఛానల్ పెట్టింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేసింది. సితార ప్రస్తుత వయసు పదేళ్లు. ఆమె మరింత మెచ్యూరిటీ సాధించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. డాన్స్, సింగింగ్ వీడియోలు షేర్ చేస్తుంది. తన ట్రావెల్ డైరీస్ పంచుకుంటుంది.

మహేష్ నట వారసురాలిగా డాన్స్ అంటే సితారకు బాగా ఇష్టం. యానీ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకుంటుంది. సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. సీతారకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. మహేష్ కూతురుగానే కాకుండా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ చేసుకుంది. దాంతో కొన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు సితారను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునే ఆలోచన చేస్తున్నాయి.

తాజాగా సితార అరుదైన ఫీట్ సాధించింది. ఇండియాలోనే మొట్టమొదటి స్టార్ కిడ్ గా అవతరించింది. యూఎస్ లోని న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ కి చాలా ప్రాధాన్యత, చరిత్ర ఉంది. ఆ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ వెలిశాయి. ప్రిన్సెస్ గెటప్ లో సితార అద్భుతం చేసింది. టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార ఫోటోలు ప్రదర్శించడంతో మహేష్ బాబు ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

సితార పిఎంజీ అనే అంతర్జాతీయ జ్యూవెలరీ సంస్థ యాడ్ చేశారు. దాంతో సదరు సంస్థ సితారతో కూడా హోర్డింగ్స్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించడం జరిగింది. ఇంత వరకు ఏ స్టార్ కిడ్ ఫోటోలు అక్కడ దర్శనమివ్వలేదు. అందుకే దీన్ని అరుదైన ఫీట్ గా భావించాలి. అయితే ఈ సంస్థ సితారకు ఇచ్చిన రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. సితార ఏకంగా కోటి రూపాయలు ఛార్జ్ చేసిందట. పదేళ్ల వయసులో కోటి రూపాయలు అవలీలగా సితార సంపాదించింది. తండ్రి మహేష్ తో కలిసి సితార ఒకటి రెండు యాడ్స్ చేయడం విశేషం. ఈ వయసులో కోటి అంటే మహేష్ ని దాటేసినట్లే లెక్క.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు