కాజల్ ను విచారించనున్న పోలీసులు..

దర్శకుడు శంకర్-విశ్వనటుడు కమలహాసన్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మూవీ ఇండియన్-2. ఇటీవల ఇండియన్-2 షూటింగ్ చైన్నెలో జరుగుతుండగా సెట్లో ఉన్నవారిపై ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి కిందపడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతిచెందగా పది మందికిపైగా గాయాల పాలయ్యారు. దర్శకుడు శంకర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కమలహాసన్, హీరోయిన్ కాజల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాద సంఘటన నుంచి సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇంకా బయట పడలేకపోతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కేసు పెట్టనప్పటికీ పోలీసులు ఈ […]

  • Written By: Neelambaram
  • Published On:
కాజల్ ను విచారించనున్న పోలీసులు..

దర్శకుడు శంకర్-విశ్వనటుడు కమలహాసన్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మూవీ ఇండియన్-2. ఇటీవల ఇండియన్-2 షూటింగ్ చైన్నెలో జరుగుతుండగా సెట్లో ఉన్నవారిపై ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి కిందపడింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతిచెందగా పది మందికిపైగా గాయాల పాలయ్యారు. దర్శకుడు శంకర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కమలహాసన్, హీరోయిన్ కాజల్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఈ ప్రమాద సంఘటన నుంచి సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇంకా బయట పడలేకపోతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కేసు పెట్టనప్పటికీ పోలీసులు ఈ కేసును స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్లకు సమన్లు జారీ చేసిన సంగతి తెల్సిందే. వీరిద్దరు పోలీసుల ఎదుట హాజరై వారడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ కాజల్ ను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగినపుడు అక్కడ ఉన్న వారందరి పేర్లతో పోలీసులు లిస్టు రెడీ చేశారు. ఇందులో కాజల్ పేరు కూడా చేర్చారు. ఇప్పటికే ఆమెకు సమన్లు జారీ చేసినట్లు కోలివుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పోలీసులు ఆమెను విచారించనున్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారి కుటుంబాలకు కమల్ హాసన్, నిర్మాణ సంస్థ ఇంకా పలువురు ఆర్థిక సాయంను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంపై ఎవరూ కేసు పెట్టనప్పటికీ పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపడుతున్నారు. కాజల్ ఇందులో 60ఏళ్ల భామగా కనిపించనుంది.

సంబంధిత వార్తలు