Singer Sunitha: ఎట్టకేలకు ఆ వ్యక్తిని బయటపెట్టిన సింగర్ సునీత… పెళ్ళయాక ఆసక్తికర పోస్ట్!

Singer Sunitha: ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సింగర్ సునీత సొంతం. ఆమె పాటకే కాదు మాటకు, నడవడికకు కూడా అభిమానులు ఉన్నారు. మోడ్రన్ అండ్ క్లాస్ కలగలిపిన లుక్ ఆమె సొంతం. 17 ఏళ్లకే పరిశ్రమలో అడుగు పెట్టిన సునీత సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాలకు పని చేశారు. ఆమె మొదటి పాటు ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ ఆల్ టైం హిట్. జనరేషన్స్ తో సంబంధం […]

  • Written By: SRK
  • Published On:
Singer Sunitha: ఎట్టకేలకు ఆ వ్యక్తిని బయటపెట్టిన సింగర్ సునీత… పెళ్ళయాక ఆసక్తికర పోస్ట్!

Singer Sunitha: ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సింగర్ సునీత సొంతం. ఆమె పాటకే కాదు మాటకు, నడవడికకు కూడా అభిమానులు ఉన్నారు. మోడ్రన్ అండ్ క్లాస్ కలగలిపిన లుక్ ఆమె సొంతం. 17 ఏళ్లకే పరిశ్రమలో అడుగు పెట్టిన సునీత సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వందల చిత్రాలకు పని చేశారు. ఆమె మొదటి పాటు ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో’ ఆల్ టైం హిట్. జనరేషన్స్ తో సంబంధం లేకుండా ప్రేమికుల్ని ఈ సాంగ్ కదిలిస్తుంది. గులాబీ మూవీతో మొదలైన ఆమె ప్రస్థానం కొనసాగుతుంది.

ప్రొఫెషనల్ గా సునీత సూపర్ సక్సెస్. పర్సనల్ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అవి ఆమె ప్రొఫెషన్ ని కూడా డిస్టర్బ్ చేసినట్టు సమాచారం. 19 ఏళ్ల వయసులో సునీత ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి, అబ్బాయి సంతానం. ఒక దశకు వచ్చాక భర్త ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. ఆయన కారణంగా ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారట. ఏళ్ల తరబడి చూసి విసిగిపోయిన సునీత విడాకులు తీసుకున్నారు. భర్తను వదిలేసి పిల్లలతో పాటు తల్లిదండ్రుల వద్దకు వచ్చేశారు.

42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ప్రకటన చేసి సునీత షాక్ ఇచ్చింది. మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ నిర్ణయం కొంచెం వివాదాస్పదమైంది. అయితే సింగర్ సునీతకు సెలబ్రిటీలు, అభిమానులు మద్దతుగా నిలిచారు. వివాహం అనేది ఆమె వ్యక్తిగత విషయం. ప్రశ్నించడానికి మీరెవరని సునీత తరపున గళం విప్పారు. 2021లో సునీత-రామ్ ల వివాహం జరిగింది. తన ఇద్దరు పిల్లలు దగ్గరుండి సునీత వివాహం చేశారు.

Singer Sunitha

Singer Sunitha

రామ్ తో వివాహం అనంతరం సునీత జీవితం మారిపోయింది. ఆమె చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇందుకు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం. తన పిల్లల కెరీర్స్ చక్కదిద్దే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి రామ్ నిర్మాతగా ఉన్నారు. తాను కోరుకున్న జీవితం ఆమెకు దక్కింది. అయితే తన జీవితాన్ని అందంగా మార్చేసిన వ్యక్తి మాత్రం రామ్ కాదట. ఆ వ్యక్తి తానేనట. ‘కేవలం నువ్వు మాత్రమే నీ జీవితాన్ని అందంగా మార్చుకో గలవు’ అంటూ సునీత ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. అది వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

సంబంధిత వార్తలు