
Singer Sunitha- Rangamarthanda
Singer Sunitha- Rangamarthanda: సింగర్ సునీత ఎమోషనల్ అయ్యారు. నా గుండె బరువెక్కిందంటూ చెప్పుకొచ్చారు. అంతగా ఆమె భావోద్వేగానికి ఎందుకు గురయ్యారంటే… రంగమార్తాండ మూవీ చూశారట. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. మార్చి 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో రంగమార్తాండ ప్రీమియర్స్ ప్రదర్శించారు . చిత్ర ప్రముఖులకు స్పెషల్ షో వేయడం జరిగింది. రంగమార్తాండ సినిమా ప్రీమియర్ షోకి సింగర్ సునీత సైతం హాజరయ్యారు. మూవీ చూశాక తన ఒపీనియన్ తెలియజేశారు.
రంగమార్తాండ అద్భుతమైన సినిమా. ఆ చిత్రంలోని పాత్రలు నా గుండె బరువెక్కేలా చేశాయి. ఆ పెయిన్ కూడా చాలా బాగుంది. అందరూ రంగమార్తాండ మూవీ చూడండి. సినిమా మాకు నచ్చుతుంది అంటూ తన రివ్యూ ఇచ్చారు. సింగర్ సునీత రివ్యూ వైరల్ అవుతుంది. ఇక దర్శకుడు కృష్ణవంశీతో సునీతకు మంచి అనుబంధం ఉంది. సునీతకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చింది ఆయనే. గులాబీ మూవీలో సింగర్ సునీత పాడిన ‘ఈ వేళలో నీవు’ సాంగ్ ఆల్ టైం సూపర్ హిట్ గా ఉంది. ఆ సాంగ్ సునీతకు విపరీతమైన క్రేజ్ తెచ్చింది.
కృష్ణవంశీ తెరకెక్కించిన పలు చిత్రాలకు సింగర్ సునీత పని చేశారు. ఫార్మ్ లో లేక ఇబ్బందిపడుతున్న కృష్ణవంశీ తన ఆశలన్నీ రంగమార్తాండ చిత్రం మీద పెట్టుకున్నారు. ఇది మరాఠీ చిత్రం నటసామ్రాట్ చిత్రాన్ని అధికారిక రీమేక్. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Singer Sunitha- Rangamarthanda
ఇక బ్రహ్మానందం పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన తన ఇమేజ్ కి భిన్నమైన ఎమోషనల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ప్రీమియర్ ద్వారా చిత్రానికి పాజిటివ్ టాక్ అందుతుంది. కమర్షియల్ గా ఏ మేరకు ఆడుతుందో చూడాలి. 2014లో రామ్ చరణ్ హీరోగా గోవిందు అందరి వాడేలే తెరకెక్కించారు. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. కృష్ణవంశీ చివరి చిత్రం నక్షత్రం డిజాస్టర్ గా మిగిలింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం పెద్ద షాక్ ఇచ్చింది.