Singer Sunitha: శుభవార్త చెప్పబోతున్న సునీత… ఇంట్లో సందడి వాతావరణం!

Singer Sunitha: సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పటి నుండి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలు ఎక్కడం హాట్ టాపిక్ అయ్యింది. సహజంగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పిల్లలు, నా భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నానంటూ సునీత తెలియజేశారు. పరిశ్రమ ప్రముఖులు ఆమెకు సప్పోర్ట్ చేశారు. […]

  • Written By: SRK
  • Published On:
Singer Sunitha: శుభవార్త చెప్పబోతున్న సునీత… ఇంట్లో సందడి వాతావరణం!

Singer Sunitha: సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్నప్పటి నుండి తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలు ఎక్కడం హాట్ టాపిక్ అయ్యింది. సహజంగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పిల్లలు, నా భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయాన్ని గౌరవించి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నానంటూ సునీత తెలియజేశారు. పరిశ్రమ ప్రముఖులు ఆమెకు సప్పోర్ట్ చేశారు.

Singer Sunitha

Singer Sunitha

మాంగో మీడియా అధినేత రామ్-సునీతల వివాహం 2021 ప్రారంభంలో ఘనంగా జరిగింది. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కోట్లకు పడగలెత్తిన రామ్ తో వివాహం తర్వాత సునీత జీవితం మారిపోయిందనేది నిజం. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఇందుకు నిదర్శనం. నచ్చిన జీవితాన్ని ఆమె స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. కోరిన ప్రదేశాలకు వెళ్లి విహరిస్తున్నారు.

మరోవైపు ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తున్నారు. త్వరలో కొడుకు ఆకాష్ ని హీరోగా పరిశ్రమకు పరిచయం చేయబోతున్నారు. ఆకాష్ డెబ్యూ మూవీని రామ్ స్వయంగా నిర్మిస్తున్నట్లు సమాచారం. ఆకాష్ ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైంది. అలాగే కూతురు శ్రేయాను సింగర్ గా సెటిల్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పటికే శ్రేయా ప్లే బ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె కొన్ని సినిమా పాటలు పాడినట్లు సమాచారం.

Singer Sunitha

Singer Sunitha

కాగా కట్టుకున్న వాడిని కూడా సునీత సంతోషపరిచారు అంటున్నారు. ఆయనకు వారసుడు ఇవ్వడానికి సునీత సిద్ధమయ్యారనే వార్త తెరపైకి వచ్చింది. మళ్ళీ పిల్లలను కనేందుకు సునీత రీకానలైజేషన్ ఆపరేషన్ చేయించుకున్నారట. ప్రస్తుతం ఆమె గర్భవతి అంటున్నారు. దీంతో రామ్ ఇంటిలో సంబరాలు నెలకొన్నాయి. భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో కూడా ఇలాంటి పుకార్లు చెలరేగిన నేపథ్యంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags

    follow us