Simhadri Closing Collections: ‘సింహాద్రి’ రీ రిలీజ్ క్లోసింగ్ కలెక్షన్స్.. కోట్లు ఖర్చు చేసి పరువు తీసుకున్నారు
అందుకే నందమూరి ఫ్యాన్స్ కి సింహాద్రి చిత్రం ఎంతో స్పెషల్. అయితే ఈ సినిమాని రీ రిలీజ్ చేసే ప్రక్రియ లో టీం ఎన్టీఆర్ పరువు తీసినంత పని చేసింది.పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ కలెక్షన్స్ ని దాటించాలనే కసి తో ఇష్టమొచ్చినట్టు లెక్కలు వేసి, ఇతర హీరోల ఫ్యాన్స్ చేత ట్రోలింగ్ కి గురయ్యారు.

Simhadri Closing Collections: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన చిత్రం ‘సింహాద్రి’. ఆరోజుల్లో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాకి దగ్గరగా వచ్చింది. ఈ సినిమా అప్పటికీ ఎన్టీఆర్ కి కేవలం 19 ఏళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ లోకి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది. అంత తక్కువ సమయం లో, చిన్న పిల్లాడి వయసులో అంత పెద్ద మాస్ రోల్ వేసి సెన్సేషన్ సృష్టించడం మామూలు విషయం కాదు.
అందుకే నందమూరి ఫ్యాన్స్ కి సింహాద్రి చిత్రం ఎంతో స్పెషల్. అయితే ఈ సినిమాని రీ రిలీజ్ చేసే ప్రక్రియ లో టీం ఎన్టీఆర్ పరువు తీసినంత పని చేసింది.పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ కలెక్షన్స్ ని దాటించాలనే కసి తో ఇష్టమొచ్చినట్టు లెక్కలు వేసి, ఇతర హీరోల ఫ్యాన్స్ చేత ట్రోలింగ్ కి గురయ్యారు.
ఖుషి చిత్రం మొదటి రోజు దాదాపుగా నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. ఇది ఆల్ టైం రికార్డు, ఈ రేంజ్ వసూళ్లు కాకపోయినా సింహాద్రి చిత్రానికి మూడు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఇది సాధారణమైన గ్రాస్ కాదు, మొదటి రోజు ఇంత వసూళ్లు అంటే ఊర మాస్ అని చెప్పొచ్చు. కానీ మరొక సినిమా రికార్డ్స్ కొట్టాలనే కసితో ఇలా చేతికి అందిన కలెక్షన్స్ వెయ్యడం వివాదాలకు దారి తీసింది.
నెల రోజుల ముందు నుండే ఈ చిత్రానికి పబ్లిసిటీ మొదలు పెట్టారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు, లిరికల్ వీడియో సాంగ్ కూడా ప్రత్యేకంగా చేయించి విడుదల చేసారు. వీటి మొత్తానికి అయినా ఖర్చు మూడు కోట్ల రూపాయిలు అట. క్లోసింగ్ లో ఈ చిత్రం కేవలం 3 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ రావాలి, అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆరు కోట్ల రూపాయిల గ్రాస్, మూడు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి, కానీ ఈ చిత్రం ఫుల్ రన్ లో అంత వసూళ్లను రాబట్టలేక చివరికి లాస్ వెంచర్ గా మిగిలిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.