‘భారతీయుడు2’ షూటింగ్ ప్రమాదంతో శింబు కీలక నిర్ణయం

కమల్ హాసన్ తాజా సినిమా భారతీయుడు 2 సెట్స్ పై ఇటీవలే భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చిత్రయూనిట్ సభ్యులు చనిపోవడం, శంకర్ సహా 10 మందికి గాయాలవడం కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు.అయితే ప్రమాదంలో చనిపోయిన వారికి ఒకొక్క కుటుంబానికి కమలహాసన్ కోటి రూపాయల సహాయం చేశారు. ఇక దర్శకుడు శంకర్ కు కూడా తీవ్ర గాయాలయినప్పటికీ అతడు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇలా షూటింగ్ లో […]

  • Written By: Raghava
  • Published On:
‘భారతీయుడు2’ షూటింగ్ ప్రమాదంతో శింబు కీలక నిర్ణయం

కమల్ హాసన్ తాజా సినిమా భారతీయుడు 2 సెట్స్ పై ఇటీవలే భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చిత్రయూనిట్ సభ్యులు చనిపోవడం, శంకర్ సహా 10 మందికి గాయాలవడం కారణంగా షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు.అయితే ప్రమాదంలో చనిపోయిన వారికి ఒకొక్క కుటుంబానికి కమలహాసన్ కోటి రూపాయల సహాయం చేశారు. ఇక దర్శకుడు శంకర్ కు కూడా తీవ్ర గాయాలయినప్పటికీ అతడు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇలా షూటింగ్ లో ప్రమాదం జరగడంతో తమిళ హీరో శింబు అతడు ప్రస్తుతం నటిస్తున్న “మానాడు” అనే సినిమా యూనిట్ కు 7.8 లక్షల రూపాయలు ఖర్చు చేసి 30 కోట్ల రూపాయల విలువైన భీమా చేయించాడు. సినిమా కోసం పనిచేస్తున్న కార్మికుల శ్రేయస్సు కోసం భీమా చేయించడం జరిగిందని చెబుతున్నారు. శింబు తీసుకున్న నిర్ణయంతో సినిమా యూనిట్ మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ‘భారతీయుడు-2’ సినిమా తరువాత మరొకసారి చిత్ర యూనిట్ కు షూటింగ్ సమయంలో భీమా చేయించాలని డిమాండ్ మరింత వ్యక్తమవుతుంది.

సంబంధిత వార్తలు