SIIMA 2023 Awards : ఆర్ ఆర్ ఆర్ లో బెస్ట్ ఎవరు?… ఈ అవార్డు తేల్చేస్తుంది.. అయితే గొడవలే!

సైమా అవార్డు ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఏ ఒక్కరి వచ్చినా మరో హీరో ఫ్యాన్స్ నొచ్చుకోవడం ఖాయం. అవార్డు గెలిచిన హీరో ఫ్యాన్స్ మరో హీరోని ట్రోల్ చేస్తారు. తెలుగు నుండి సైమా ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వస్తుందనే ఆసక్తి నెలకొంది.

  • Written By: NARESH
  • Published On:
SIIMA 2023 Awards : ఆర్ ఆర్ ఆర్ లో బెస్ట్ ఎవరు?… ఈ అవార్డు తేల్చేస్తుంది.. అయితే గొడవలే!

SIIMA 2023 Awards : ఆర్ ఆర్ ఆర్ మూవీ నందమూరి-మెగా ఫ్యాన్స్ ని దగ్గర చేస్తుంది అనుకుంటే మరిన్ని విబేధాలకు కారణమైంది. విడుదల వరకు మౌనంగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తర్వాత రెచ్చిపోయారు. సినిమాలో మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ కామెంట్స్ చేసుకున్నారు. ప్రతి విషయంలో ఇద్దరి మధ్య పోటీ వాతావరణం నెలకొంది. పోలికలు తీసుకొచ్చారు. అసలు ఎన్టీఆర్ సెకండ్ హీరో అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఎక్కడో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా అలానే అనిపించింది. దర్శకుడు రాజమౌళిని ఓ రేంజ్ లో వేసుకున్నారు.

రాజమౌళికి డైరెక్ట్ సందేశాలు పంపారని, ఎన్టీఆర్ ని తక్కువ చేసి చుపిస్తావా? అని బూతులు తిట్టారనే ప్రచారం జరిగింది. ఈ సినిమా విషయంలో అందుకునే గౌరవం, వచ్చే గుర్తింపు సమానంగా ఉండాలి. లేదంటే మావాడికి కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నట్లు సోషల్ మీడియా వార్స్ నడిచాయి. ఫ్యాన్ వార్స్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మధ్య కూడా చిచ్చు పెట్టాయా? అనే వాదన ఉంది. ఆస్కార్ వేడుక తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసింది లేదు.

ఇదిలా ఉంటే సైమా అవార్డ్స్… ఈ ఫ్యాన్ వార్ ని మరోసారి రగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 (SIIMA) ఉత్తమ నటుడు నామినేషన్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ చోటు దక్కింది. అలాగే సీతారామన్ నుండి దుల్కర్, కార్తికేయ చిత్రానికి గానూ నిఖిల్, మేజర్ మూవీ నుండి అడివి శేష్, డీజే టిల్లు మూవీకి గానూ సిద్ధు జొన్నలగడ్డ నామినేట్ అయ్యారు.

సైమా అవార్డు ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఏ ఒక్కరి వచ్చినా మరో హీరో ఫ్యాన్స్ నొచ్చుకోవడం ఖాయం. అవార్డు గెలిచిన హీరో ఫ్యాన్స్ మరో హీరోని ట్రోల్ చేస్తారు. తెలుగు నుండి సైమా ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వస్తుందనే ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్-రామ్ చరణ్ లలో ఒకరు గెలిస్తే సోషల్ మీడియా వార్ షురూ అవుతుంది. వారిద్దరు కాకుండా ఎవరు గెలిచినా ఈ అవార్డు మేటర్ అంత వివాదం కాదు. మరి చూడాలి ఏం జరగనుందో.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు