ప్చ్..   ఆడవాళ్లు అంటే   అంత చులకనా..   హీరోగారు  ?  

   Siddharth’s tweet about Saina Nehwal  : హీరో సిద్ధార్ద్ కి కాస్త ఆవేశం ఎక్కువ.  ముఖ్యంగా  సామాజిక విషయాల పై  తరచుగా సోషల్ మీడియాలో  స్పందిస్తూ ఏదో రకంగా వివాదాలోకి తల దూరుస్తూ ఉంటాడు. రీసెంట్ గా   పొలిటికల్ సెటైర్స్ వేస్తూ చాలా  ట్వీట్స్ చేశాడు.  అయితే,  ప్రస్తుత విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన  మోదీ కాన్వాయ్ ఘటన గురించి తెలిసిందే.  అయితే, ఆ ఘటన పై  సైనా స్పందిస్తూ..  ‘ప్రధాని భద్రత  విషయంలోనే   రాజీ పడితే దేశం సురక్షితంగా […]

ప్చ్..   ఆడవాళ్లు అంటే   అంత చులకనా..   హీరోగారు  ?  

 

 Siddharth’s tweet about Saina Nehwal  : హీరో సిద్ధార్ద్ కి కాస్త ఆవేశం ఎక్కువ.  ముఖ్యంగా  సామాజిక విషయాల పై  తరచుగా సోషల్ మీడియాలో  స్పందిస్తూ ఏదో రకంగా వివాదాలోకి తల దూరుస్తూ ఉంటాడు. రీసెంట్ గా   పొలిటికల్ సెటైర్స్ వేస్తూ చాలా  ట్వీట్స్ చేశాడు.  అయితే,  ప్రస్తుత విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన  మోదీ కాన్వాయ్ ఘటన గురించి తెలిసిందే.  అయితే, ఆ ఘటన పై  సైనా స్పందిస్తూ..  ‘ప్రధాని భద్రత  విషయంలోనే   రాజీ పడితే దేశం సురక్షితంగా ఉండదు.  ఆ పిరికివాళ్ల దాడిని ఖండిస్తున్నాను’  అంటూ  సైనా నెహ్వాల్ కామెంట్స్ చేసింది. 
 
 
కాగా ఆమెకు  సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ  ‘కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. షేమ్ ఆన్ యూ’ అంటూ ట్వీట్ పెట్టాడు.  అంటే దీని అర్ధం ఏమిటంటే.. . ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్.   దేవుడి దయతో   మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ    సిద్ధార్ద్ కాస్త వెటకారంగా కామెంట్ పెట్టాడు.  అయితే,  ఈ ట్వీట్  తీవ్ర రచ్చకు దారితీసింది. ముఖ్యంగా   సిద్ధార్థ్‌ ట్వీట్‌  సైనాను అవమానించే రీతిలో ఉంది అనే వాదన బాగా బలంగా వినిపించింది.  
 
 
 దాంతో  హీరో సిద్దార్థ్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. మహిళా కమిషన్   ఈ ట్వీట్‌ ను చాలా సీరియస్ గా  తీసుకుంది.  సిద్ధార్థ్‌  తన  ట్వీట్‌ లోని  పరుష భావజాలాన్ని  వాడి వెటకారంగా కామెంట్ పెట్టాడు అని  మహిళా కమిషన్ అభిప్రాయపడుతోంది.  పైగా  సిద్ధార్థ్‌  తన  వ్యాఖ్యలతో  ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా  ప్రవర్తించాడు అని   జాతీయ మహిళా కమిషన్  చెబుతుంది.   
 
 
అలాగే  సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని కూడా  కమిషన్ వెల్లడించడం విశేషం.   ఓ మహిళ పై   అసభ్యకరమైన భాషను వాడినందుకు  సిద్ధార్థ్‌ ను కఠినంగా శిక్షించాలని కూడా  జాతీయ మహిళా కమిషన్  కోరింది. ఐతే  సిద్ధార్థ్  మాత్రం  తాను  ఎవరినీ అవమాన పరచాలని  ఈ వ్యాఖ్యలు చేయలేదని  చెప్పుకొచ్చాడు. 
 
 
 హీరో సిద్ధార్థ్ కి వచ్చిన ఇబ్బందేంటో  గానీ.. ఇలా తనకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ముందుకు పోతున్నాడు.   అయినా సామాజిక విషయాలపై తరచుగా  స్పందించే  సిద్ధార్ద్ కి మహిళల గౌరవాన్ని  కాపాడాలని తెలియక పోవడం విచిత్రం.  ఆ మధ్య  సమంత విడాకుల ప్రకటన చేసిన వెంటనే   ”మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు… ? అంటూ  సిధ్దార్ద్  ఇన్ డైరెక్ట్ గా సామ్ పై దాడికి దిగాడు. ఆడవాళ్ళ పై కామెంట్స్ చేయడం ఈ  హీరోకి బాగా అలవాటు అయినట్టు ఉంది. 

సంబంధిత వార్తలు