Shyam Singha Roy Telugu Movie Review: నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్ : నవీన్ నూలి

Shyam Singha Roy Telugu Movie
నాని క్లీన్ హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది. ఆయన నటించిన గత మూడు చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో హిట్ కొట్టడం ఆయనకు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రయోగాత్మక సబ్జెక్టు ఎంచుకున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ నేడు విడుదల కాగా… మరి నాని హిట్ కొట్టారో లేదో చూద్దాం..
కథ:
సినిమా డైరెక్టర్ కావాలనే కోరికతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వాసు(నాని) ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతారు. ఈ క్రమంలో తనకు నచ్చిన అమ్మాయి కీర్తి(కృతి శెట్టి)ని అతికష్టం మీద ఒప్పించి, ఆమె హీరోయిన్ గా ఓ షార్ట్ ఫిలిం చేస్తాడు. ఈ ఫిల్మ్ ఊహించని విజయం సాధిస్తుంది. అదే సమయంలో ఇది బెంగాల్ కి చెందిన శ్యామ్ సింగరాయ్ కథకు కాపీ అంటూ లీగల్ సమస్యలు ఎదురవుతాయి. వాసు ఒరిజినల్ గా రాసుకున్న కథ.. శ్యామ్ సింగరాయ్ కథకు ఎలా మ్యాచ్ అయ్యింది? అసలు వాసుకు శ్యామ్ సింగరాయ్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఈ శ్యామ్ సింగరాయ్ ఎవరు? అనేది మిగతా కథ..
Also Read: Natural Star Nani: నాని ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫేవరెట్ హీరో
విశ్లేషణ:
పునర్జన్మల నేపథ్యంలో అనాదిగా అనేక కథలు తెరకెక్కాయి. వాటిలో చాలా చిత్రాలు విజయం సాధించాయి. ఫార్ములా పాతది అయినప్పటికీ చెప్పే విధానంగా కొత్తగా ఉంటే సక్సెస్ సొంతమవుతుంది. ఆ విషయంలో దర్శకుడు రాహుల్ చాలా వరకు విజయం సాధించాడు. రెండు భిన్నకాలాలకు చెందిన వాసు, శ్యామ్ సింగరాయ్ పాత్రను ఆయన అనుసంధానం చేసిన తీరు లాజికల్ గా సాగింది. దీనికోసం ఆయన రాసుకున్న సన్నివేశాలు మెప్పించాయి.
శ్యామ్ సింగరాయ్ పూర్తిగా నాని వన్ మ్యాన్ షో. వర్ధమాన దర్శకుడిగా, సోషల్ భావాలు కలిగిన యాక్టివిస్ట్ గా నాని నటన చాలా సహజంగా ఉంది. శ్యామ్ సింగరాయ్ పాత్రలో ఉన్న ఆవేశం, ఎమోషన్స్ తన బాడీ లాంగ్వేజ్ లో చక్కగా పలికించారు. ఇక సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ సాయి పల్లవి. ఆమె పాత్రకు చెప్పుకోదగ్గ నిడివి లేకున్నప్పటికీ ఆమెపై తెరకెక్కించిన సాంగ్స్, సన్నివేశాలు మంచి అనుభూతిని పంచుతాయి. ఇక మోడ్రెన్ గర్ల్ గా కృతి తనలోకి కొత్త షేడ్స్ ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే అంశాలు.
ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ నిడివితో పాటు స్లో నేరేషన్ ఒకింత ఇబ్బంది పెడతాయి. కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నారు.ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు సినిమా నెమ్మదిగా సాగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకొనేలా లేవు. క్లైమాక్స్ కూడా అనుకున్న స్థాయిలో ఉండదు.
ప్లస్ పాయింట్స్:
నాని, సాయి పల్లవి యాక్టింగ్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ బ్యాంగ్
కథ
Also Read: Nani: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !
మైనస్ పాయింట్స్
లెన్త్
స్లో నేరేషన్
క్లైమాక్స్
సినిమా చూడాలా? వద్దా?
లవ్, ఎమోషన్స్,సస్పెన్సు, సోషల్ మెసేజ్ బ్లెండ్ చేసి ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాహుల్ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మలచాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు. ప్రధాన పాత్రలు చేసిన నాని, సాయి పల్లవి నటనతో పాటు రెండు భిన్న కాలాలకు చెందిన పాత్రలను ఆయన అనుసంధానం చేసిన తీరు లాజికల్ గా సాగింది. అయితే స్లో నేరేషన్, లెంగ్త్, ప్లే ఒకింత నిరాశపరిచే అంశాలు. మొత్తంగా నాని శ్యామ్ సింగరాయ్ గా ఎంటర్టైన్ చేస్తాడు అనడంలో సందేహం లేదు.