సీనియర్ హీరోయిన్ శ్రియ అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇంకా హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యం అనిపించినా శ్రియకి ఇంకా క్రేజ్ ఉంది. ఆమెకు ఇప్పుడూ భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలొస్తున్నాయి. ఆల్ రెడీ కెరీర్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ బ్యూటీ, చరణ్ – శంకర్ కలయికలో రాబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజ్ అనుకున్న ప్రతిసారి ఓ భారీ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తోన్న శ్రీయకి, మళ్ళీ అలాంటి సినిమానే తగలడం నిజంగా విశేషమే.
Also Read: ప్రిన్స్.. జక్కన్న మూవీ.. నిజమేనా అంటున్న ఫ్యాన్స్..
నిజానికి శ్రియ కెరీర్ 2014కే ఔట్ అనుకున్నారంతా. ఎందుకంటే, అప్పటికి ఆమెకు తెలుగులో అసలు అవకాశాల్లేవు. చిన్నాచితకా చిత్రాల్లో చిన్న పాత్రలు కూడా చేయడానికి శ్రియ ఆసక్తి చూపించింది. కానీ కరెక్ట్ గా ఆ టైమ్ లో “మనం” అనే క్లాసిక్ హిట్ రావడంతో.. మరో నాలుగేళ్లు సీనియర్ హీరోలకు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మళ్ళీ ఇక ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలో 2017లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. బాలయ్య సరసన ఎమోషనల్ క్యారెక్టర్ లో ఆమె అభినయం మొత్తానికి ఆమెకు మళ్ళీ మరో నాలుగేళ్లు లైఫ్ ను ఇచ్చింది.
Also Read: ఆటనాది.. కోటి మీది అంటున్న యంగ్ స్టార్…
కేవలం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వల్లే.. గాయత్రి, పైసా వసూల్, వీరభోగ వసంతరాయలు లాంటి పది సినిమాలు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ శ్రియకి ఛాన్స్ లు రావడం లేదు. ఇక ఈ సారి ఆమె కెరీర్ క్లోజ్ అయినట్టే అని గాసిప్స్ ఊపందుకుంటున్న టైమ్ లో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ మూవీ పట్టేసింది. అక్కడ చరణ్ తో స్నేహం కారణంగా ఇప్పుడు శంకర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర చేయడానికి రెడీ అవుతుంది. మొత్తానికి కెరీర్ లేదనుకున్న ప్రతిసారి భారీ ఛాన్స్ అందుకుంటుంది శ్రియ.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్