India Vs Australia 2nd Odi: అయ్యర్ సెంచరీ.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇప్పుడెలా? ఎవరిని పక్కనపెడుతారు?

అందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన సంచరిని సాధించాడు.ఇక అతనితో పాటు ఈ మ్యాచ్ లో గిల్ కూడా ఒక మంచి సెంచరీ నమోదు చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 05:33 PM IST

India Vs Australia 2nd Odi: ఇంకో 10 రోజుల్లో ఇండియా లో అత్యంత వైభవంగా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇండియా టీం లోని ప్లేయర్లు అందరూ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు.ఇక వరల్డ్ కప్ లో బెంచ్ పైన కూర్చునే ప్లేయర్లు అయిన సూర్య కుమార్ యాదవ్ శ్రేయాస్ అయ్యర్లు కూడా ఇప్పుడు వాళ్ల సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా మీద ఇండియా ఆడిన మొదటి వన్డే మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు అని ప్రూవ్ చేసుకంటే, ఇక ఇవాళ్ళ జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా 2 వ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా చాలా మంచి స్కోర్ చేస్తూ ముందుకు వెళుతుంది.

అందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన సంచరిని సాధించాడు.ఇక అతనితో పాటు ఈ మ్యాచ్ లో గిల్ కూడా ఒక మంచి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వరల్డ్ కప్ లో ప్లేయింగ్ 11 లో ఎవరు ఆడతారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే ఏషియా కప్ లో రాహుల్ సెంచరీ చేసి తన అద్భుతమైన ఫామ్ ని కనబరిచాడు.

ఇక మొన్న జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో కూడా కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్ మెన్ గా కూడా రాహుల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. అలాంటి క్రమంలో నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్ ఎవరు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ఎందుకంటే మొన్నటిదాకా శ్రేయస్ అయ్యర్ అంత పెద్ద ఫామ్ లో లేడు. ఆయన గాయం నుంచి కొలుకున్న కూడా ఫామ్ లో లేడని ఆయన్ని ఒక్క మ్యాచ్ లో మాత్రమే తీసుకున్నారు. మిగతా అన్ని మ్యాచ్ లకి పక్కన పెట్టేసారు. కానీ ఆస్ట్రేలియా మీద ఆడిన మొదటి వన్డే మ్యాచ్ లో రన్ ఔట్ అయినప్పటికీ రెండో వన్డే మ్యాచ్ లో మాత్రం తన సత్తా చాటాడు. దాంతో ఇప్పుడు వరల్డ్ కప్ ప్లేయింగ్ 11 లో రాహుల్ ఉంటాడా,లేక అయ్యర్ ఉంటాడా అనేది చర్చనీయాంశం గా మారింది.

ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం ఇక్కడ కీలక నిర్ణయంగా మారనుంది.తుది సమరంలో ఎవరైతే ఇండియా టీం ని విజయతీరాలకు చేర్చుతారో వాళ్లని మాత్రమే తీసుకోవాలి.ఇప్పుడు ఇద్దరు కూడా ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.కాబట్టి వీళ్ళలో ఎవరిని తీసుకుంటారు అనేది కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ కలిసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది…చూడాలి మరి తుది సమరం లో ఎవరు ఉంటారో…