China Floods: రెయిన్‌ ఎఫెక్ట్‌ : వరద పోటెత్తింది.. వాహనం గుంతలో పడింది.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

ఇటీవల కురిసిన భారీ వర్షాలు చైనాను వణికించాయి. 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రకృతి విళయం సృష్టించినప్పుడు ప్రమాదక దృశ్యాలు షాక్‌కు గురిచేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Written By: Raj Shekar
  • Published On:
China Floods: రెయిన్‌ ఎఫెక్ట్‌ : వరద పోటెత్తింది.. వాహనం గుంతలో పడింది.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

China Floods: ప్రకృతి ప్రకోపానికి ఎవరైనా తల వంచాల్సిందే. టెక్నాలజీ పెరిగింది. సైన్స్‌ అభివృద్ధి చెందింది.. అన్నీ మార్చేస్తాం.. అనుకుంటే అది అయ్యే పనికాదు. హై టెక్నాలజీలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ప్రకృతి విళయం ముందు అవి నిలవలేకపోతున్నాయి. ఇందుకు తాజాగా చైనాలో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలిచింది. భారీ వర్షానికి రోడ్డు మధ్య భాగం కొట్టుకుపోయిందని తెలియక వేగంగా వెళ్తున్న ఓ కారు గుంతలో పడింది. ఈ దృశ్యాన్ని వెనుక నుంచి వస్తున్న వాహనం డాష్‌క్యామ్‌లో రికార్డు అయింది. ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక దశలో మార్గమధ్యలో పడి ఉన్న గుంతలో కూరుకుపోయింది. భారీ వర్షాలకు బ్రిడ్జిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో మార్గమధ్యలో భారీ గుంత ఏర్పడింది. తనకు తెలియకుండానే వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్‌ నేరుగా లోయలో పడిపోయాడు. ఈ సీన్‌ ఒక్కక్షణం గుండె ఆగినట్టు అనిపిస్తుంది.

భారీ వర్షాలకు వణికిన చైనా..
ఇటీవల కురిసిన భారీ వర్షాలు చైనాను వణికించాయి. 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రకృతి విళయం సృష్టించినప్పుడు ప్రమాదక దృశ్యాలు షాక్‌కు గురిచేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చైనాలో చిత్రీకరించారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఏర్పడ్డ భారీ గుంతలో ఒక్కసారిగా పడిపోయింది. రెప్పపాటులో ఈ ఘటన జరిగింది. అప్పటి వరకు మామూలుగానే ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. క్షణంలో కారు అందులో పడిపోయింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఈ ఘటన హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో జరిగింది. ఈ వీడియోను ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియోలో వేగంగా వెళ్తున్న కారు కనిపిస్తుంది.. ఈ దృశ్యం వెనుక నుంచి వస్తున్న వాహనం డాష్‌క్యామ్‌లో రికార్డు అయింది. దీని తర్వాత ఏమైందిం? డ్రైవర్‌ పరిస్థితి ఎలా ఉంది అన్నది స్పష్టం తెలియలేదు. అయితే తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ రక్షించబడినట్టుగా తెలిసింది. ఆగస్టు 3న అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు