SV Ranga Rao Grandsons: బాలయ్య బాబు మరోసారి తనకు ఉన్న నోటిదూలతో ఈమధ్య కాలం లో జరిగిన ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవ వేడుక లో లెజెండ్స్ ని అవమానించిన తీరు పై సోషల్ మీడియా లో పెద్ద రచ్చ జరుగుతుంది..’ఆ రంగారావు ఈ రంగారావు..అక్కినేని తొక్కినేని’ అంటూ బాలయ్య అదుపు తప్పి మాట్లాడాడు..దీనిపై అక్కినేని ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా బాలయ్య బాబు దిష్టి బొమ్మలను తగలపెట్టి ‘నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి’ అంటూ హెచ్చరించారు.

SV Ranga Rao Grandsons
దీనిపై బాలయ్య బాబు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు..క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నా కూడా బాలయ్య పట్టించుకోవడం లేదంటే ఆయన అక్కినేని కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు..అంతే కాకుండా SV రంగారావు ని కూడా అస్తమించాడు తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ ఎస్వీ రంగారావు గారి సామాజిక వర్గమైన కాపునాడు ఒక బహిరంగ లేఖని రాసింది..అయితే బాలయ్య చేసిన కామెంట్స్ పై ఎస్వీ రంగారావు మనవళ్లు ఊహించని రీతిలో స్పందించారు.

SV Ranga Rao Grandsons
వాళ్ళు మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో ‘వీర సింహ రెడ్డి’ విజయోత్సవ సభ లో బాలయ్య బాబు గారు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో బాగా ట్రోల్ల్స్ రావడం గమనించాము..బాలయ్య బాబు గారికి మా కుటుంబానికి ఎంతో మంచి సన్నిహిత్య బంధం ఉంది..ఆయన మా తాత గారిని కించపరిచి మాట్లాడినట్టు మాకు ఏమి అనిపించలేదు..కాబట్టి మీరు ఈ విషయాన్నీ డ్రాగ్ చెయ్యడం ఆపేసి ఇరువురి కుటుంబ సభ్యుల అభిమానులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దు’ అంటూ ఈ సందర్భంగా ఒక వీడియో విడుదల చేసారు..అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..SVR మనవళ్లను చూడడం ఇదే మొట్టమొదటిసారి..వీళ్లిద్దరు సినీ రంగానికి దూరంగా వ్యాపార రంగం లో రాణిస్తున్నారు..ఇండస్ట్రీ నుండి వీళ్ళకి బాలయ్య బాబు తో మంచి సాన్నిహిత్యం ఉంది.