Jeevita Rajasekhar జీవితా రాజశేఖర్ కు షాక్.. ‘శేఖర్’ మూవీ నిలిపివేత

Shock to Jeevita Rajasekhar .. ‘Shekhar’ movie discontinued : జీవితా రాజశేఖర్.. టాలీవుడ్ లోనే మోస్ట్ వివాదాస్పద సినీ జంటగా విమర్శలు ఎదుర్కొంది. అప్పట్లో మా అసోసియేషన్ సందర్భంగా రాజశేఖర్ తీరు.. ఆ తర్వాత బయట గొడవలు.. సినిమాల నిర్మాణంలో నిర్మాతలు, ఫైనాన్షియర్స్ వీరికున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. ఇటీవలే ‘గరుడువేగ’ సినిమా నిర్మాత వీరిపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు తన దగ్గర అప్పు తీసుకొని జీవితా రాజశేఖర్ ఎగ్గొట్టారని తీవ్ర […]

  • Written By: Naresh
  • Published On:
Jeevita Rajasekhar జీవితా రాజశేఖర్ కు షాక్.. ‘శేఖర్’ మూవీ నిలిపివేత

Shock to Jeevita Rajasekhar .. ‘Shekhar’ movie discontinued : జీవితా రాజశేఖర్.. టాలీవుడ్ లోనే మోస్ట్ వివాదాస్పద సినీ జంటగా విమర్శలు ఎదుర్కొంది. అప్పట్లో మా అసోసియేషన్ సందర్భంగా రాజశేఖర్ తీరు.. ఆ తర్వాత బయట గొడవలు.. సినిమాల నిర్మాణంలో నిర్మాతలు, ఫైనాన్షియర్స్ వీరికున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు..

ఇటీవలే ‘గరుడువేగ’ సినిమా నిర్మాత వీరిపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు తన దగ్గర అప్పు తీసుకొని జీవితా రాజశేఖర్ ఎగ్గొట్టారని తీవ్ర విమర్శలు చేశారు.ఈ వివాదం ముగియకముందే మరొకటి మొదలైంది.

రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ‘శేఖర్’ సినిమాను జీవితనే దర్శకత్వం వహించి ఎంతో కష్టపడి.. డబ్బులు ఖర్చు పెట్టి మరీ పూర్తి చేసింది. అప్పు తీసుకొచ్చిందో.. ఆస్తులు తనఖా పెట్టిందో కానీ ఈసినిమా చాలా ముఖ్యమైని.. ఇది ఆడకపోతే తమ భవిష్యత్ అంధకారమని రిలీజ్ కు ముందు తెగ ప్రమోట్చేసింది.

ఈ క్రమంలోనే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శేఖర్’ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను తెచ్చుకుంది. అయితే పాజిటివ్ టాక్ తో నడుస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ‘శేఖర్’ మూవీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చిత్ర ప్రదర్శ నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసి గట్టి షాక్ ఇచ్చింది. సినిమా ఆడకపోతే తమ భవిష్యత్ కష్టమని జీవిత అలా అన్నదో లేదో ఇలా సినిమా ప్రదర్శన మూతపడింది.

జీవితా రాజశేఖర్ డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆయన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్’ సినిమా ప్రదర్శ న నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోపు రూ.65 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు తెలిపింది.

నగదు డిపాజిట్ చేయకపోతే శేఖర్ మూవీ అన్ని హక్కులు అటాచ్ చేయాలని ఆదేశించింది. థియేటర్లు, డిజిటల్,శాటిలైట్, ఓటీటీ యూట్యూబ్ లో ఎలాంటి ప్రసారాలు చేయవద్దని కోర్టు పేర్కొంది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నటుడు రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కుట్ర చేసి తమ సినిమాను ఆపేశారని.. ఈసినిమా కోసం చాలా కష్టపడ్డామన్నామని ఎమోషనల్ అయ్యారు.