Janasena – TDP : టీడీపీ సీట్లతో జనసేనకు షాక్
తెనాలి టిక్కెట్ తనకేనని ప్రకటించిన మనోహర్ కు టీడీపీ హైకమాండ్ బ్రేక్ వేసింది. అక్కడ సైతం టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారని సంకేతాలిచ్చింది. అవసరమైతే మనోహర్ కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామంటూ టీడీపీ తేల్చినట్టు తెలిసింది. మొత్తానికైతే సీట్ల సర్దుబాటుకు ముందే జనసేనకు టీడీపీ షాకుల మీద షాకులిస్తోంది.

Janasena – TDP : టీడీపీ-జనసేన పొత్తు గ్యారెంటీగా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ఏకాతంగా సమావేశం కావడంతో రానున్న ఎన్నికల్లో పొత్తు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే అభ్యర్థుల అనౌన్స్ చేయడంలో టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తూ జనసేనకు షాకిస్తోంది. ముఖ్యంగా కాపు బేస్ ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను కన్ఫర్మ్ చేయడం జనసేనకు మింగుడు పడడం లేదు.
టీడీపీ, జనసేన మధ్య పొత్తు అధికారంగా కుదరకపోయినా.. ఆ రెండు పార్టీలు మానసికంగా సిద్ధమయ్యాయి. ఇరువురు నేతలు తమ చర్యల ద్వారా పొత్తులు తప్పవని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. కాషాయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాలు అడగాలని జనసేన డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి. తమ బలమేమిటో తెలుసునని.. అందుకు తగ్గట్టుగా సీట్లు కోరతామని పవన్ చెబుతున్నారు. బీజేపీ లైన్ లోకి వస్తే కానీ సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
అయితే ఏపీలో పొత్తు ధర్మానికి కాదని టీడీపీ వరుసగా క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తోంది. అయితే చాలా స్థానాల్లో జనసేన ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. అటువంటి స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించడం విశేషం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా బొండా ఉమాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అదే నియోజకవర్గాన్ని ఆశించి అభ్యర్థిత్వం దక్కకపోవడంతో వంగవీటి రాధాక్రిష్ణ టీడీపీలో చేరారు. ఆయనకు ఉన్నత స్థానం దక్కాలని జనసేన చూస్తోంది. కాపులు ఎక్కువగా ఉండే సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని జనసేన నుంచి బలమైన వాయిస్ వినిపిస్తోంది. కానీ రాధాను పక్కకు నెట్టి తిరిగి బొండా ఉమాకే టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సత్తెనపల్లి నియోజకవర్గ విషయంలో సైతం అదే జరిగింది. అక్కడ జనసేన కేడర్ బలంగా ఉంది. పొత్తుల్లో భాగంగా సత్తెనపల్లి జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఉంది.అయితే అనూహ్యంగా టీడీపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆయనకేనని సంకేతాలిచ్చింది. దీంతో జనసేనలో ఉండే ఆశావహులంతా నీరుగారిపోయారు. జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ విషయంలో సైతం అదే షాక్ ఎదురైంది. తెనాలి టిక్కెట్ తనకేనని ప్రకటించిన మనోహర్ కు టీడీపీ హైకమాండ్ బ్రేక్ వేసింది. అక్కడ సైతం టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారని సంకేతాలిచ్చింది. అవసరమైతే మనోహర్ కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామంటూ టీడీపీ తేల్చినట్టు తెలిసింది. మొత్తానికైతే సీట్ల సర్దుబాటుకు ముందే జనసేనకు టీడీపీ షాకుల మీద షాకులిస్తోంది.
