KCR Grandson Himanshu: ముద్దుల హిమాన్షు మాటలు.. “తాత కేసీఆర్ బంగారు పాలన”ను దెప్పిపొడుస్తున్నాయి
కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించబట్టి 9 ఏళ్ళు అవుతోంది. ప్రభుత్వం మీద ఏ మాత్రం విమర్శ వచ్చినా అది నేరుగా కేసీఆర్ కు మాత్రమే తగిలేది. బహుశా ఈ ఆలోచన హిమాన్షు రావు మైండ్ లో లేననట్టుంది.

KCR Grandson Himanshu: “రాజు వెడలె రవి తేజము లలరగ” ఈ సామెత ను “మనవడు వెడలె రవి తేజము లలరగ” ఇప్పుడు మార్చుకోవాలేమో.. ఎందుకంటే నిన్న హిమాన్షు రావు గౌలిదొడ్డి పాఠశాలను ప్రారంభించిన నేపథ్యంలో మీడియా ఇచ్చిన కవరేజ్ అలా ఉంది మరి. ఒకప్పుడు బరువుగా ఉండి.. అక్కడక్కడికి వెళ్లేవాడు.. భద్రాచలం రామయ్య పెళ్లికి, కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి రాజకుమారుడు స్టేటస్ తో వెళ్లాడు. అసలే అది భారత రాష్ట్ర సమితి కాబట్టి.. అతడు కేసీఆర్ మనవడు కాబట్టి.. తక్కిన నాయకులు మొత్తం నమస్కారాలు పెట్టేవారు. దండాలు అందుకునేవాడు. దండలు వేసుకునేవాడు. ఇప్పుడు బరువు తగ్గాడు. హైట్ నాన్న కేటీఆర్ కంటే ఎక్కువగానే కనిపిస్తున్నాడు. గౌలిదొడ్డిలోని పాఠశాలను దత్తత తీసుకున్నాడు. విరాళాలు సేకరించి ఆ పాఠశాలకు కొత్త రూపు తీసుకొచ్చాడు. అంతకుముందు ఆ పాఠశాలను సందర్శించినప్పుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ పని ఎందుకు చేశాడు అనేది పక్కన పెడితే.. పాఠశాలలను బాగు చేశాడు కాబట్టి అభినందిద్దాం. అతని ప్రసంగం కూడా బాగుంది. తాతను గుర్తు చేసింది. నాన్నను స్ఫురణకు తెచ్చింది. అంటే అతని మాట తీరు జనానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. బహుశా అది అతని తాత నుంచి వారసత్వంగా వచ్చి ఉంటుంది.
నాన్న శకమే ప్రారంభం కాలేదు
అసలే రాజు మనవడు. ప్రజా జీవితంలోకి వచ్చాడు. పాఠశాలను ప్రారంభించాడు.
ఈ భారత రాష్ట్ర సమితి నాయక గణం ఊరుకోదు కదా! ఊరుకుంటే ఎంతటి నామార్ద అనుకుందో.. దండలు వేసింది. రాజ మర్యాదలు చేసింది. జై జై అంటూ నినాదాలు చేసింది. ఈ మాత్రం దానికే ఆత్రుత దేనికి? ప్రజాజీవనంలోకి రాకముందే ఈ జిందా బాద్ ల గోల దేనికి? అప్పుడే ఈ రాజమనవడికి అంత వేగం దేనికి? చదివే పూర్తి కాలేదు. ఈ దశలు పూర్తి అయితేనే కదా మెచ్యూరిటీ వచ్చేది. అయినా ఇంకా అతని నాన్న శకమే ప్రారంభం కాలేదు.. ఇంకా ఆయన దుఃఖ లాగానే ఉన్నానని చెబుతున్నాడు. ఇలాంటప్పుడు దండాలు పెట్టి, దండలు వేసి చెడగొట్టకపోవడమే భారత రాష్ట్ర సమితి అతడికి చేసే విలువైన సహాయం.
9 ఏళ్ళయింది
ఇక కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించబట్టి 9 ఏళ్ళు అవుతోంది. ప్రభుత్వం మీద ఏ మాత్రం విమర్శ వచ్చినా అది నేరుగా కేసీఆర్ కు మాత్రమే తగిలేది. బహుశా ఈ ఆలోచన హిమాన్షు రావు మైండ్ లో లేననట్టుంది. అందుకే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే ” ఆడపిల్లల టాయిలెట్స్ ముందు పందులు తిరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేవు. అవన్నీ చూస్తే కన్నీళ్లు వచ్చాయి. పిల్లలు ఆట మైదానాలు లేక రాళ్లలో ఆడుకుంటున్నారు. ఒక పిల్లవాడు నా ముందే కింద పడి గాయపడ్డాడు.” ఇలా గౌలిదొడ్డి పాఠశాల గురించి హిమాన్షురావు ఏదో చెప్పుకుంటూ పోయాడు. అతని మాటల్లో దురుద్దేశాలు కనిపించలేదు. కానీ అతడు అన్న మాటలు అక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, అక్కడ లేని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గట్టిగానే తగిలాయి.
పూర్తిగా గాలికి వదిలేసింది
నిజంగానే ఈ తొమ్మిది నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రాథమిక విద్యను, ప్రభుత్వ విద్యను పూర్తిగా గాలికి వదిలేసింది. మరీ ముఖ్యంగా టీచర్ల హేతుబద్ధీకరణను పక్కన పెట్టింది. ఇక ఇంటర్ విద్య పరిస్థితి కూడా అలానే ఉంది. ఏకంగా ప్రభుత్వ కాలేజీల్లో 40% ఎన్రోల్మెంట్ తగ్గడం ఇందుకు గట్టి ఉదాహరణ. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించిన తర్వాత కూడా ఎన్రోల్మెంట్ తగ్గడం ఆశ్చర్యకరమైన విశేషమే. స్కూళ్ల స్థాయిని కేంద్ర ప్రాథమిక విద్యా నివేదికలే బట్టబయలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ పాలన తాలూకూ వైఫల్యాలే. కొత్తగా హిమాన్షురావు చెబుతున్న కన్నీళ్లు లెక్క కూడా ఆయన పాలనకు దక్కిన అభిశంషన. అందుకే నిన్నటి నుంచి నెటిజన్లు ఆ విధంగా రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి హిమాన్షురావ్ కావాలని విమర్శలు చేయలేదు. కానీ అతడు చేస్తున్న ఎమోషనల్ కామెంట్స్ తాత పాలనను వెలెత్తి చూపిస్తున్నాయి. మరి వీటిని చూసయినా కెసిఆర్ మారతాడా? లేక డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి పై నిరసనలకు పిలుపునిస్తాడా? ఏమో వీటికి కాలమే సమాధానం చెప్పాలి.
