Bigg Boss 7 Telugu: తేజాతో తన సరదా తీర్చుకున్న శోభ… బాల్ గేమ్ లో కంటెస్టెంట్స్ చెత్త స్ట్రాటజీస్!

శివాజీ ఇంకా తేజ భుజాలపై చేతులేసుకుని లివింగ్ ఏరియా లో రాంప్ వాక్ చేశారు. తర్వాత తేజ అన్న అమ్మాయిలు ఒకరినొకరు కలిసినపుడు .. ఇలా చేస్తారు కదా అంటూ .. శోభా ని ,రతిక ని వెళ్లి హగ్ చేసుకున్నాడు.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: తేజాతో తన సరదా తీర్చుకున్న శోభ… బాల్ గేమ్ లో కంటెస్టెంట్స్ చెత్త స్ట్రాటజీస్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. కాగా తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఈ వారానికి సంబంధిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. టాస్క్ మొదలయ్యే ముందు హౌస్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ జరిగింది. శోభాశెట్టి ,తేజ కి చీర కట్టి,బొట్టు పెట్టి,మేకప్ వేసి ఆడ పిల్లలా రెడీ చేసింది.నువ్వు ఇలానే బాగున్నావు తేజ అంటూ లివింగ్ ఏరియా కి తీసుకువచ్చింది.

శివాజీ ఇంకా తేజ భుజాలపై చేతులేసుకుని లివింగ్ ఏరియా లో రాంప్ వాక్ చేశారు. తర్వాత తేజ అన్న అమ్మాయిలు ఒకరినొకరు కలిసినపుడు .. ఇలా చేస్తారు కదా అంటూ .. శోభా ని ,రతిక ని వెళ్లి హగ్ చేసుకున్నాడు. మన జోడి చాలా బాగుంది కదరా అంటూ శివాజీ తేజ తో అనగానే మన జోడి నా అని తేజ అన్నాడు . దానికి శివాజీ అన్నా చెల్లెలి జోడి రా.. అని అన్నాడు. ఇలా తేజ కాసేపు హౌస్ మేట్స్ ని ఎంటర్టైన్ చేశాడు.

ఇక తర్వాత ‘హాల్ ఆఫ్ ది బాల్ ‘ అని కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ తమకున్న ప్రత్యకమైన బలాలు ఉపయోగించి టాస్క్ ఆడాల్సి ఉంటుంది అని చెప్పారు బిగ్ బాస్.ఇందుకు హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. సమయానుసారంగా బజర్ మోగిన ప్రతిసారి ఒక పైప్ ద్వారా బాల్స్ పంపిస్తున్నారు బిగ్ బాస్. ఇక బాల్స్ సంచుల్లో నింపుకొంటూ .. కంటెస్టెంట్స్ ఎప్పటిలానే తన్నుకున్నారు.

కాగా మీరు ఫిసికల్ అవుతున్నారు అంటూ రతిక,అర్జున్ ని అడిగింది. గౌతమ్ కూడా లాగాడు గా .. నేను లాగకుండా ఎలా ఉంటా .. లాగుతా .. రతిక బ్యాగ్ నేను లాగుతా అని అన్నాడు అర్జున్. మధ్యలో రతిక బాల్స్ దొంగతనం చేస్తూ కనిపించింది.అవతలి టీం స్ట్రాటజీ చూసి శివాజీ .. వాళ్లకు నేర్పించిందే మనం రా.. అది మన మీదే ప్లే చేస్తున్నారు అని అమర్ తో చెప్పాడు. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ప్లే చేస్తూ గేమ్ ఆడుతున్నారు కంటెస్టెంట్స్. దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ చూడాలి మరి.

 

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు