Shikar Dhavan : ఆ తప్పుతో హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న శిఖర్ ధావన్..!
Shikar Dhavan : టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నాడు. ఆ ప్రాంతంలో టూర్ కి వెళ్ళినప్పుడు చేసిన చిన్న పొరపాటు కారణంగానే ఈ పరీక్ష చేయించుకున్నట్లు స్వయంగా శిఖర్ ధావన్ వెల్లడించాడు. శిఖర్ ధావన్ చేసిన ఆ తప్పు ఫలితంగా చేసుకున్న పరీక్షల్లో ఏమొచ్చింది. శిఖర్ ధావన్ ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు బయట పెట్టాడు ఒకసారి తెలుసుకుందాం. ఇండియన్ క్రికెట్ లో డాషింగ్ ఓపెనర్ గా శిఖర్ ధావన్ పేరు […]

Shikar Dhavan : టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నాడు. ఆ ప్రాంతంలో టూర్ కి వెళ్ళినప్పుడు చేసిన చిన్న పొరపాటు కారణంగానే ఈ పరీక్ష చేయించుకున్నట్లు స్వయంగా శిఖర్ ధావన్ వెల్లడించాడు. శిఖర్ ధావన్ చేసిన ఆ తప్పు ఫలితంగా చేసుకున్న పరీక్షల్లో ఏమొచ్చింది. శిఖర్ ధావన్ ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు బయట పెట్టాడు ఒకసారి తెలుసుకుందాం.
ఇండియన్ క్రికెట్ లో డాషింగ్ ఓపెనర్ గా శిఖర్ ధావన్ పేరు సంపాదించుకున్నాడు. నిలకడ అయిన ఆటతీరుతో గత కొన్నేళ్లుగా టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. మరోవైపు యంగ్ ప్లేయర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తనని తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండడంతో.. కీలక సీరీస్ లకు దూరమయ్యాడు. అయితే, శిఖర్ ధావన్ తన వ్యక్తిగతమైన అంశానికి సంబంధించిన ఒక అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
హెచ్ఐవి పరీక్ష చేయించుకున్న శిఖర్ ధావన్..
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నాడు. ఈ పరీక్షను హెచ్ఐవి/ఎయిడ్స్ బారిన పడ్డామన్న అనుమానం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. శిఖర్ ధావన్ ఫోన్ కూడా ఈ పరీక్షను అదే అనుమానంతో చేసుకున్నాడు. ఎక్కువమంది ఈ పరీక్షను అసరక్షితమైన లైంగిక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, పొరపాటున ఏదైనా ఈ తరహా తప్పు చేసినప్పుడు ఈ పరీక్ష చేయించుకుంటారు. అయితే శిఖర్ ధావన్ అటువంటి తప్పు చేయకపోయినప్పటికీ ఈ పరీక్ష చేయించుకున్నాడు.
అందుకే ఆ పరీక్షకు వెళ్ళిన ధావన్..
శిఖర్ ధావన్ ఫ్యామిలీతో కలిసి అనేక ప్రాంతాలకు వెళుతుంటాడు. టూర్ అంటే శిఖర్ ధావన్ కు చాలా ఆసక్తి. అందులో భాగంగానే 15 ఏళ్ల క్రితం మనాలి టూర్కు వెళ్లాడు. టాటూలంటే అమితమైన ఇష్టం ఉన్న శిఖర్ ధావన్.. మానాలి టూర్ లో పలు టాటూలు వేయించుకున్నాడు. అయితే టాటూలు వేయించుకున్న తర్వాత ఒక భయం శిఖర్ ధావన్ ను వెంటాడింది. తాటు వేసిన సూదితో చాలామందికి వేస్తారని తెలిసి భయపడ్డానని, నాలుగు నెలల తర్వాత హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నట్లు శిఖర్ ధావన్ తాజాగా వెల్లడించాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ఫలితాల్లో తనకు నెగిటివ్ వచ్చిందని శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు.
రాజకీయాలకు పట్ల ఆసక్తి లేదన్న ధావన్..
గత కొన్నాళ్లుగా క్రికెటర్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. గౌతమ్ గంభీర్ వంటి ప్లేయర్లు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇదే విషయంపై పలువురు శిఖర్ ధావన్ ప్రశ్నించగా.. అటువంటి ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికీ ఇప్పుడు రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం క్రికెట్లో రాణించడం పైన దృష్టి సారిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే ఆలోచిస్తానని ఈ సందర్భంగా ధావన్ పేర్కొన్నాడు.
శరీరమంతా టాటూలు..
క్రికెటర్ శిఖర్ ధావన్ కు టాటూలు అంటే ఎంత పిచ్చి అంటే.. ఎక్కడికి వెళ్ళినా ఆయా ప్రాంతాల్లో ఉండే భిన్నమైన టాటూలు వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. అందుకే శిఖర్ ధావన్ శరీరం నిండా టాటులు కనిపిస్తుంటాయి. చిన్నప్పటి నుంచి తనకు టాటూలు అంటే చాలా ఇష్టమని, అందుకే ఎక్కడికి వెళ్ళినా వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటానని అనేకసార్లు శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు.