Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?

Shekar Movie Review:  రివ్యూ : శేఖర్ మూవీ రేటింగ్: 2 25 /5 నటీనటులు: డా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చంధాని, శివాని రాజశేఖర్, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర దర్శకత్వం : జీవిత రాజశేఖర్ నిర్మాత: బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్. సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా జీవితా రాజశేఖర్ […]

  • Written By: SRK
  • Published On:
Shekar Movie Review: రివ్యూ : శేఖర్ మూవీ – హిట్టా ? ఫట్టా ?

Shekar Movie Review:  రివ్యూ : శేఖర్ మూవీ

రేటింగ్: 2 25 /5

నటీనటులు: డా.రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చంధాని, శివాని రాజశేఖర్, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర

దర్శకత్వం : జీవిత రాజశేఖర్

Shekar Movie Review

hero rajasekhar

నిర్మాత: బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్.

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని

డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో వచ్చిన సినిమా శేఖర్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

Also Read: Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

క‌థ‌:

మత్తులో మునిగిపోయిన శేఖర్ (రాజశేఖర్) క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం బెస్ట్ అంటూ కథ మొదలుపెట్టారు. కేసులను చేధించడంలో శేఖర్ ను మించిన ఎక్స్ పర్ట్ లేడు అనేది కథలోని మెయిన్ పాయింట్. ఇంత బెస్ట్ అనిపించినప్పటికి, పర్సనల్ లైఫ్ లో మాత్రం డిజాస్టర్ అని శేఖర్ పాత్రను పరిచయం చేశారు. ఇలా చడీచప్పుడూ లేకుండా సాగిపోతున్న శేఖర్ జీవితంలో పెద్ద కుదుపు వస్తోంది. అతని మాజీ భార్య ఇందుకు యాక్సిడెంట్ అయ్యి ఆమె చనిపోతుంది. అయితే, సిటీ ఆసుపత్రిలోనే ఆమె చనిపోవడం, గతంలో ఇదే హాస్పిటల్ లో తన కూతురు గీత (శివాని రాజశేఖర్ ) కూడా సేమ్ ఇలాగే చనిపోవడంతో శేఖర్ కి అనుమానం కలుగుతుంది. వారి చావుల పై తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ వాళ్ళు ఎలా చనిపోయారు ? దీని వెనుక ఎవరు ఉన్నారు ? చివరికి శేఖర్ ఏమి కనిపెట్టాడు ? అనేదే మిగతా కథ.

నటీనటులు :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన శేఖర్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి శేఖర్ తాలూకు పెయిన్.. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అండ్ ఎమోషన్ వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముస్కాన్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే ఆమెలో హీరోయిన్ మెటీరియల్ లేదు.

Shekar Movie Review

hero rajasekhar

మరో కీలక పాత్రలో నటించిన శివాని రాజశేఖర్, తన పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే ప్రధాన పాత్రలో నటించిన సమీర్, ప్రకాష్ రాజ్ కూడా తమ పాత్రలకు అనుగుణంగా తమ నటనలో వేరియేషన్స్ చూపిస్తూ సినిమాలో సీరియస్ నెస్ ను తీసుకువచ్చారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ప్రెషన్స్ తో ఒక ఇంట్రస్ట్ ను
మెయింటైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కానీ.. ఇలాంటి సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లింగ్ డ్రామాలో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగాలి. ఈ శేఖర్ మూవీలో ఇవే మిస్ అయ్యాయి. దాంతో సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా ఇంట్రస్ట్ గా సాగలేదు.

ప్లస్ పాయింట్స్ :

రాజశేఖర్ నటన,

ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ స్టోరీ

సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,

స్క్రీన్ ప్లే బోర్ గా సాగడం,

అక్కడక్కడా స్లోగా నడిచే సన్నివేశాలు,

కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.

రెగ్యులర్ డ్రామా ఎక్కువ అవ్వడం.

Shekar Movie Review

hero rajasekhar

చివరగా..

మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ శేఖర్ చిత్రంలో మెయిన్ థీమ్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమాలో పేలవంగా సాగే స్క్రీన్ ప్లే, బోరింగ్ సీన్స్ ప్రేక్షకుడికి సినిమా పై కలిగే ఆసక్తిని నీరుగారుస్తాయి. మొత్తం మీద శేఖర్ పూర్తిగా ఆకట్టుకోడు. అయితే ఆర్గాన్స్ మాఫియా అనే కొత్త పాయింట్ ఉంది కాబట్టి, కొత్తధనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంతవరకు పర్వాలేదనిపిస్తోంది.

Also Read:Garuda Vega Producer: జీవిత రాజశేఖర్ మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు.. నిర్మాత సంచలన ఆరోపణలు

Tags

    follow us