Uttar Pradesh Groom: పారిపోతున్న వరుడిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్న వధువు
ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు ప్రేమికులు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

Uttar Pradesh Groom: సాధారణంగా వధువు పారిపోతే వరుడు వెతుక్కోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ వరుడు పారిపోతే వధువు వెతికి పట్టుకుని మరీ పెళ్లి పీటల మీదకు తీసుకొచ్చింది. రెండేళ్లు ప్రేమించుకుని తీరా పెళ్లి పెట్టుకున్నాక ముఖం చాటేయాలని చూడటంతో అతడిని వెంటాడి మరీ పట్టుకుంది. చివరకు పెళ్లిపీటలు ఎక్కించి కథ సుఖాంతం చేసింది. సినీ ఫక్కీలో జరిగిన సంఘటన అందరిలో ఆసక్తి కలిగించింది.
ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు ప్రేమికులు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబాల్లో సుముఖత వ్యక్తం చేయడంతో పెళ్లికి రెడీ అయిపోయారు. ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడుకున్నారు.
ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. కానీ పెళ్లి కుమారుడు మాత్రం మండపానికి చేరుకోలేదు. దీంతో అందరు ఎదురు చూశారు. కానీ అతడు రాలేదు. చివరకు పెళ్లి కూతురు ఫోన్ చేసినా సమాధానం సరిగా ఇవ్వకపోవడంతో ఇక ఆమె రంగంలోకి దిగింది. పెళ్లి కుమారుడిని వెతికే పనిలో పడింది. అన్ని ప్రాంతాల్లో వెతికి చివరకు పట్టుకుంది.
ఓ చోట బస్సు ఎక్కుతుండగా పట్టుకుని పెళ్లి మంటపానికి తీసుకొచ్చింది. ఈ క్రమంలో బరేలీకి 20 కిలోమీటర్ల దరంలో భీమోరా పోలీస్ స్టేషన్ దగ్గర అతడిని దొరికించుకుంది. ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా ముగిసింది. అలా వరుడిని దొరికించుకుని పెళ్లి చేసుకున్న ఆమె ధైర్యాన్ని అందరు ప్రశంసించారు. అందరు ఆడపిల్లల్లో అంతటి తెగువ ఉండాలని చెబుతున్నారు.