YS Sharmila: వైఎస్ మరణాన్ని వదిలేశావా షర్మిల
ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం సోనియా గాంధీని ఆశ్రయించింది. తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక ఎన్నో రకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో కుట్ర కోణం ఉందని.. దీని వెనుక ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చివరకు రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఇదే అనుమానాన్ని వెలిబుచ్చారు. ఇదే సానుభూతితో జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ప్రజల సానుభూతి పొందగలిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల విశ్వాసాన్ని పొందగలిగారు.2019 ఎన్నికల్లో అంతులేని విజయాన్ని కూడా ఇదే కారణమైంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో విలన్ గా మారింది మాత్రం సోనియా గాంధీ అండ్ కుటుంబం.
ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం సోనియా గాంధీని ఆశ్రయించింది. తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.తెలంగాణలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన ఫలితం లేకుండా పోయింది.దీంతో తన తండ్రి కి ఆదరించిన కాంగ్రెస్ పార్టీ ఆమెకు దిక్కయింది.కానీ నాడు తన తండ్రి మరణం సమయంలో ఇదే షర్మిల కాంగ్రెస్ అధినాయకత్వంపై ఎన్నో ఆరోపణలు చేసింది.తన తండ్రి మృతికి కాంగ్రెస్ నాయకత్వమే కారణమన్న వారిలో షర్మిల ఒకరు.ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించడం చర్చనీయాంసమైంది.నాడు తాను చేసిన ఆరోపణలు నిర్వివాదమని తేలింది. అప్పట్లో సోదరుడికి అధికారం అప్పగించ లేదన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీపై షర్మిల ఎన్నో ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే షర్మిల ఆరోపణలు తప్పిదమని తేలుతూ కాంగ్రెస్ గూటికి చేరినట్లు అయింది.
వాస్తవానికి వైసీపీ ఆవిర్భావానికి ముందే కాంగ్రెస్ పార్టీపై ఒక నిరోధారణ ఆరోపణ ఎదురైంది.రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ఒక ఆరోపణ వెల్లువెత్తింది.2011 ఆగస్టులో అంబటి రాంబాబు వైయస్సార్ మరణం వెనుక కుట్ర కోణం ఉందని ఒక ప్రకటన విడుదల చేశారు.కొన్ని సందర్భాల్లో వైయస్ జగన్, షర్మిల, విజయమ్మ ఇదే రకమైన ఆరోపణలు చేశారు. సోనియాగాంధీతో పాటు ఆమె కుటుంబం పై కూడా ఈ ఆరోపణలు వెల్లువెత్తుతాయి. జగన్ సొంత మీడియా సాక్షి లో సైతం పతాక శీర్షికన ఒక కథనం ప్రచురితమైంది. దానికి సజీవ సాక్షంగా షర్మిల, విజయమ్మ అభిప్రాయంతో కూడిన ఒక వార్త వచ్చింది.2022 సెప్టెంబర్ లో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల సైతం తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉందన్న ఆరోపణలు చేశారు.
అయితే ఇప్పుడు అదే షర్మిల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. నాడు సోనియాగాంధీ పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకున్నట్లేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ద్వారా వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతులేని ప్రజామోదాన్ని పొందగలిగారు. కానీ వారి వారసులు అదే కాంగ్రెస్ను విభేదించారు. ఇప్పుడు వారిలోనే వారు విభేదించుకొని కాంగ్రెస్ను ఆశ్రయించడం విశేషం. కానీ నాడు వైయస్ మరణం వెనుక కాంగ్రెస్ ఉందన్న ఆరోపణలు అబద్ధమని.. షర్మిల సోనియాగాంధీ చెంతకు చేరడంతో తేటతెల్లమైంది.
