Sharmila And Sunitha: జగనన్నకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పని షర్మిల,సునీత

మూడేళ్ల కిందట వరకు ఆ కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమమైనా పండుగల జరుపుకునేవారు. రక్షాబంధన్ వచ్చిందంటే చాలు.. షర్మిల తో పాటు సునీత జగన్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపేవారు. ఆ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి.

  • Written By: Dharma Raj
  • Published On:
Sharmila And Sunitha: జగనన్నకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పని షర్మిల,సునీత

Sharmila And Sunitha: ఏపీ సీఎం జగన్ కు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఒకరు సొంత చెల్లి షర్మిల కాగా.. ఇంకొకరు బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. రక్షాబంధన్ నాడు ఇద్దరు చెల్లెళ్లు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఒకరు కూడా కట్టిన దాఖలాలు లేవు. షర్మిల కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్ళగా.. సునీత తండ్రి మరణం పై పోరాడే క్రమంలో జగన్ కు దూరమయ్యారు.

మూడేళ్ల కిందట వరకు ఆ కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమమైనా పండుగల జరుపుకునేవారు. రక్షాబంధన్ వచ్చిందంటే చాలు.. షర్మిల తో పాటు సునీత జగన్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపేవారు. ఆ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సోదరి షర్మిలను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె తెలంగాణలో పార్టీని స్థాపించారు. మరోవైపు బాబాయ్ వివేకా హత్య కేసులో నిందితులకు జగన్ మద్దతుగా నిలుస్తున్నారని మరో సోదరి సునీత ఆరోపిస్తున్నారు. ఆమె సైతం జగన్ కు ఎప్పుడో దూరమయ్యారు. దీంతో రక్షాబంధన్ నాడు వైయస్ కుటుంబంలో ఎటువంటి సందడి లేకుండా పోయింది. కనీసం అన్నకు సోషల్ మీడియా వేదికగానైనా శుభాకాంక్షలు చెప్పడానికి చెల్లెళ్లకు మనసు అంగీకరించలేదు. అందరూ తమ అన్నల గురించి తమ అనుబంధం గురించి చెప్పుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ అందుకు సైతం చెల్లెళ్లు అంగీకరించకపోవడం వారి మధ్య ఎడబాటును తెలియజేస్తుంది.

అయితే షర్మిల ఓ పోస్ట్ పెట్టారు. కానీ అందులో ఎక్కడా జగన్ ప్రస్తావన లేదు. ” నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి అడుగులు వేస్తూ రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మరియు రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ” అంటూ షర్మిల ట్విట్ చేశారు. అంతకుమించి ఒక్క ప్రస్తావం చేయలేదు. తన అన్న జగన్ గురించి ఎక్కడా చెప్పలేదు. అయితే దీనికి వైసీపీ శ్రేణులు వక్ర భాష్యం చెబుతున్నాయి. జగన్కు గతంలో షర్మిల ఎప్పుడు రాఖీ కట్టిన దాఖలాలు లేవని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. చివరిగా 2018 లోనే షర్మిల జగన్ కు రాఖీ కట్టారని కొందరు గుర్తు చేస్తున్నారు. అంటే విభేదాలు గత నాలుగేళ్లుగా తారాస్థాయికి చేరుకున్నట్లేనని వైసీపీ శ్రేణులు ఒప్పుకున్నట్లు అయ్యింది. అయితే షర్మిల, సునీత లేని లోటును మంత్రి విడదల రజిని భర్తీ చేశారు. ఆమె సీఎం జగన్ కు రాఖీ కట్టారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాయి.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు