
Shanmukh Jaswanth
Shanmukh Jaswanth: సోషల్ మీడియా ని ఉపయోగించే ఎవరికైనా షణ్ముఖ్ జస్వంత్ అంటే తెలియకుండా ఉండదు.ఇక బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఇతను కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. యూట్యూబ్ ఈయన చేసే సాంగ్స్ కి మరియు షార్ట్ ఫిలిమ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.ముఖ్యంగా ఈయన చేసిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ మరియు ‘సూర్య’ వంటి షార్ట్ ఫిలిమ్స్ కి అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ క్రేజ్ తోనే ఆయన బిగ్ బాస్ ఆఫర్ కొట్టాడు. సీజన్ 5 రన్నర్ అప్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షో ప్రభావం ఇతని వ్యక్తిగత జీవితం పై కూడా గట్టిగానే పడింది. హౌస్ లో ఈయన సిరి అనే కంటెస్టెంట్ తో నడిపిన ప్రేమాయణం, చేసిన రొమాన్స్ అతని పై తీవ్రమైన వ్యతిరేకత తెచ్చేలా చేసింది. ఫలితంగా బయటకి వచ్చిన తర్వాత అతని ప్రేయసి దీప్తి సునైనా షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇది జరిగి ఏడాది దాటింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే షన్ను ‘అయ్యయ్యో’ అనే ఒరిజినల్ పాట ని విడుదల చేసాడు.ఇందులో ఫణి పూజిత అనే కొత్త అమ్మాయితో షణ్ముఖ్ వేసిన డ్యాన్స్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ఇందులో ఆయన ఆమెతో చేసిన రొమాన్స్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Shanmukh Jaswanth
ఇదంతా కేవలం తన మాజీ లవర్ దీప్తి సునైనా కి బాగా కాలాలనే చేస్తున్నాడా అని సోషల్ మీడియా లో షణ్ముఖ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.’నువ్వు ఎంత మంది అమ్మాయిలతో రొమాన్స్ చేసిన, మేమెప్పుడూ మిమల్ని షన్ను – దీప్తి గానే చూస్తాము.దీప్తి సునైనా కూడా ఈమధ్య కాలం లో చాలా సాంగ్స్ చేసింది కానీ, మీలాగా ఇలా అయితే హద్దులు దాటలేదు’ అంటూ షణ్ముఖ్ పై వీర్కహుకుపడుతున్నారు ఫ్యాన్స్ .అంతలా మంటలు రేపిన ఆ పాటపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.