Zodiac Signs: ఉగాది నుంచి ఈ ఐదు రాశుల వారికి శని పడుతుందట?
Zodiac Signs: తెలుగు సంవత్సరాది ఉగాది. మార్చి 22న ఉగాది వస్తోంది. కొత్త సంవత్సరానికి బుధుడు రాజుగా ఉన్నాడు. శుక్రుడు మంత్రిగా మారుతున్నాడు. ఈ కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు మరికొన్ని రాశులకు చేదు ఫలితాలు ఇవ్వబోతోంది. కొత్త పంచాంగంలో ఈ వివరాలు పొందుపరచారు. గ్రహాల కలయిక, ఆగమనం వలన ఐదు రాశులకు నష్టాలే మిగులుతున్నాయి. ఏడు రాశులకు మాత్రం మంచి ఫలితాలు ఇవ్వబోతోంది. దీంతో ఉగాది చేదు, తీపి ఫలితాల కలయికగా […]


Zodiac Signs
Zodiac Signs: తెలుగు సంవత్సరాది ఉగాది. మార్చి 22న ఉగాది వస్తోంది. కొత్త సంవత్సరానికి బుధుడు రాజుగా ఉన్నాడు. శుక్రుడు మంత్రిగా మారుతున్నాడు. ఈ కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు మరికొన్ని రాశులకు చేదు ఫలితాలు ఇవ్వబోతోంది. కొత్త పంచాంగంలో ఈ వివరాలు పొందుపరచారు. గ్రహాల కలయిక, ఆగమనం వలన ఐదు రాశులకు నష్టాలే మిగులుతున్నాయి. ఏడు రాశులకు మాత్రం మంచి ఫలితాలు ఇవ్వబోతోంది. దీంతో ఉగాది చేదు, తీపి ఫలితాల కలయికగా చెబుతున్నారు.
ఉగాది పండగ ఏడాదంతా మంచి జరగాలని కోరుకుంటారు. జ్యోతిష్య నిపుణుల వద్ద పంచాంగ శ్రవణం చేస్తారు. ఐదు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి? వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు? తదితర విషయాలు తెలియడంతో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త సంవత్సరంలో పంచాంగం ఒకలా ఉండదు. కొన్ని రాశులకు మోదం మరికొన్ని రాశులకు ఖేదం కలగడం సహజమే. దీనిపై అనవసర భయాలు పెట్టుకుంటే ముందుకు వెళ్లలేం.
ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురు కానున్నాయి. అనేక రకాల సమస్యల్లో ఇరుక్కుంటారు. ప్రతి పని విజయవంతం కావాలంటే ఎంతో సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మొండి పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా ఏడాదంతా సమస్యలే పలకరించనున్నాయి. ఆర్థిక ఇబ్బందులు వేదనకు గురిచేస్తాయి. సామాజిక అంశాల్లో ఎదురు దెబ్బలే తగలనున్నాయి. మానసిక బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Zodiac Signs
మకర రాశి వారికి ఏడాది పొడవునా శనీశ్వరుడికి కష్టాలు ఎదురు కానున్నాయి. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు వీరు నానా పాట్లు పడాల్సిందే. ఈ రాశి వారికి ఎన్నో బాధలు కలగనున్నాయి. ఇంకా కుంభ రాశి వారికి కూడా వ్యయ ప్రయాసలు కలగనున్నాయి. శనివారం హనుమంతుడిని పూజిస్తే కొంత ఉపశమనం లభిస్తుంి. రావిచెట్టు కింద ఇనుప ఉంగరం పెట్టి ఆవనూనెతో దీపం వెలిగించడం మంచిది. మీన రాశి వారికి కూడా ఏడాది ఇబ్బందులు ఎదురు కానున్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు శనివారం నల్ల నువ్వులు దానం చేయడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి.